Skip to main content

Guidelines for UGC Exam : రేప‌టి నుంచి యూజీసెట్ ప‌రీక్ష‌లు.. ఈ జాగ్ర‌త్త‌లను పాటించండి..

యూనివర్శిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి పోస్టుల్లో ఉద్యోగాలు చేసేందుకు నిర్వహించే ఎంపిక ప‌రీక్ష‌.. యూజీసీ నెట్‌.
Precautions and rules for ugc exam candidates

సాక్షి ఎడ్యుకేష‌న్: యూనివర్శిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి పోస్టుల్లో ఉద్యోగాలు చేసేందుకు నిర్వహించే ఎంపిక ప‌రీక్ష‌.. యూజీసీ నెట్‌. ఈ ప‌రీక్ష‌లు రేపు అంటే, జనవరి 3వ తేదీ నుంచి  ప్రారంభమై జ‌న‌వ‌రి 16వ తేదీ వ‌ర‌కు జ‌రుగుతాయి.

Tenth Class Preparation Tips: పదో తరగతి.. మంచి మార్కులకు మార్గమిదే!!

ఈ ప‌రీక్ష‌ల‌ను ఎన్‌టీఏ.. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వ‌హిస్తుంది. ఇప్ప‌టికే ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన అడ్మిట్ కార్డుల‌ను విడుద‌ల చేసింది బృందం. అభ్య‌ర్థులు వారి హాల్‌టికెట్ల‌ను డౌన్‌లోడ్ చేసుకొని వారి కేంద్రాన్ని ముందుగానే ప‌రిశీలించుకోవాల‌ని తెలిపారు అధికారులు.

అభ్య‌ర్థులు ఈ జాగ్ర‌త్త‌లు పాటించాలి..

రెండు షిఫ్టుల్లో నిర్వ‌హించే ఈ ప‌రీక్ష‌ల‌ను తొలి సెషన్ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. అలాగే రెండవ సెషన్ మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ప‌రీక్ష ప్రారంభం అయ్యే అర‌గంట ముందే అభ్య‌ర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

➾ అభ్య‌ర్థులు వారి అడ్మిట్ కార్డు హార్డ్ కాపీని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్ల‌డం త‌ప్ప‌నిస‌రి.

Junior Lecturers : జూనియ‌ర్ క‌ళాశాలలో జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ పోస్టుల జాబితా.. త్వ‌ర‌లోనే..

➾ ఒక‌ పాస్‌పోర్ట్-సైజ్ ఫొటో, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐడీ కార్డు, ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ప‌రీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి.

➾ యూజీసీ నెట్ రాసే పరీక్షా కేంద్రంలోకి వెళ్లాక ఎలక్ట్రానిక్ పరికరాల్ని వాడటం నిషేధం. 

➾ అభ్యర్థి పరీక్ష సమయంలో ముందు లేదా తర్వాత ఏదైనా దుష్ప్రవర్తనకు పాల్పడితే కేసులు బుక్ చేస్తామని ఎన్టీఏ హెచ్చరిస్తోంది. ఇందుకు గాను భవిష్యత్తులో మూడు సంవత్సరాలు డిబార్ చేస్తారు. క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారు.

➾ ప‌రీక్ష కేంద్రానికి ఎటువంటి ఎలెక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు అనుమ‌తి లేదు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 03 Jan 2025 08:09AM

Photo Stories