UGC NET Exam Dates 2024 : యూజీసీ నెట్-2024 పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏఏ పరీక్ష ఎప్పుడంటే..?
ఆగస్టు 21, 22, 23, 26, 28, 29, 30, సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు యూజీసీ వెల్లడించింది. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే సీబీటీ ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతను జాతీయ పరీక్షల మండలికి అప్పగించింది. ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు.
ఇంతకాలం పీహెచ్‌డీలో చేరాలంటే.. పీజీ పూర్తి చేసి.. నెట్‌లో సంబంధిత సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. యూజీసీ తాజా నిర్ణయంతో నాలుగేళ్ల వ్యవధిలోని బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు కూడా నెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెట్ స్కోర్ ఆధారంగా పీహెచ్‌డీలో ప్రవేశం పొందొచ్చు. యూజీసీ–నెట్‌ను ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. ఈ ఏడాది.. తొలి విడత పరీక్ష జూన్–2024కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో అర్హత ప్రమాణాలు, నెట్ నిర్వహించే కేటగిరీలలో మార్పులు ప్రకటించారు.
విద్యార్హతలు :
- కనీసం 55% మార్కులతో పీజీ(పోస్ట్ గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణులవ్వాలి. కోర్సు చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- పీహెచ్‌డీలో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 75 శాతం మార్కులు సాధించాలి.
- రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు అయిదు శాతం మినహాయింపు కల్పిస్తారు.
- అర్హత కోర్సు చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్ చదువుతున్న వారు కూడా నెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగాల అభ్యర్థులకు సర్టిఫికెట్లు పొందాకే.. వీటికి అర్హత లభిస్తుంది. పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే వారు నెట్ ఫలితాలు విడుదలైన సంవత్సరంలోపు నిర్దేశిత శాతంతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
వయసు :
- జేఆర్‌ఎఫ్ అభ్యర్థుల వయసు జూన్ 1, 2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు.ఓబీసీ–ఎన్‌సీఎల్, ఇతర రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది.
- అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్, పీహెచ్‌డీలో ప్రవేశం కోరే అభ్యర్థులకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు.
- నాలుగేళ్ల డిగ్రీతో పీహెచ్‌డీ
- యూజీసీ–నెట్ 2024 జూన్ నోటిఫికేషన్ ప్రకారం–నాలుగేళ్ల వ్యవధిలోని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు కూడా నెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో అర్హత సాధించి యూనివర్సిటీలలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందొచ్చు. యూనివర్సిటీలు నాలుగేళ్ల డిగ్రీతోనూ పీహెచ్‌డీలో ప్రవేశం కల్పించాలని యూజీసీ ఇప్పటికే మార్గనిర్దేశకాలు జారీ చేసింది. దీనికోసం నెట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. పీహెచ్‌డీలో ప్రవేశం పొందాలనుకునే నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులు కనీస 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని నిర్దేశించింది.
మూడు కేటగిరీలుగా పరీక్ష :
- ఇప్పటి వరకు రెండు కేటగిరీల్లోనే (జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్) నెట్‌ను నిర్వహించారు. రీసెర్చ్/జేఆర్‌ఎఫ్ పట్ల ఆసక్తి ఉన్న వారు.. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగానికి.. అధ్యాపక వృత్తికి మాత్రమే పరిమితం అవుదామనుకునే వారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకునే వారు. దీనికి భిన్నంగా ఇకపై మూడు కేటగిరీలుగా నెట్ పరీక్షను నిర్వహించనున్నారు. అవి..
- కేటగిరీ–1: జేఆర్‌ఎఫ్ (జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్), అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం.
- కేటగిరీ–2: అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, పీహెచ్‌డీలో ప్రవేశం.
- కేటగిరీ–3: పీహెచ్‌డీలో ప్రవేశానికి మాత్రమే.
పరీక్ష స్వరూపం :
- యూజీసీ నెట్ పరీక్ష స్వరూపంలో ఎలాంటి మార్పులు లేవు. గతంలో మాదిరిగానే రెండు పేపర్లుగా మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ రెండు పేపర్లు కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
- పేపర్–1: టీచింగ్/రీసెర్చ్ ఆప్టిట్యూడ్. ఈ విభాగంలో 50 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- పేపర్–2: సబ్జెక్ట్ పేపర్: అభ్యర్థుల డొమైన్ సబ్జెక్ట్ నుంచి 100 ప్రశ్నలతో 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- పేపర్–1(టీచింగ్/రీసెర్చ్ ఆప్టిట్యూడ్) మూడు కేటగిరీల అభ్యర్థులకు ఉమ్మడిగా ఉంటుంది.
కనీస అర్హత మార్కులు :
యూజీసీ నెట్ పరీక్షలో మూడు కేటగిరీల అభ్యర్థులు (జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్, పీహెచ్‌డీ) ఉత్తీర్ణత సాధించాలంటే.. తాము రాసిన పేపర్లలో కనీస అర్హత మార్కులు సాధించాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లలో కలిపి 40 శాతం మార్కులు, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు 35 శాతం మార్కులు పొందాలి. ఈ సడలింపు (35 శాతం మార్కులు)ను జనరల్– ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా వర్తిస్తుంది.
ఉమ్మడి పేపర్‌కు సన్నద్ధత :
మూడు కేటగిరీల అభ్యర్థులకు ఉమ్మడి పేపర్‌గా నిర్దేశించిన పేపర్–1లో.. టీచింగ్, రీసెర్చ్ ఆసక్తులను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. మొత్తం పది విభాగాల (టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ అండ్ ఎన్విరాన్‌మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్–గవర్నెన్స్, పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్) నుంచి ఒక్కో విభాగంలో అయిదు ప్రశ్నలు చొప్పున అడుగుతారు.
సబ్జెక్ట్ పేపర్‌కు ఇలా..
పేపర్–2లో ప్రశ్నలు అభ్యర్థుల పీజీ స్పెషలైజేషన్ లేదా డొమైన్ సబ్జెక్ట్ ఆధారంగా ఉంటాయి. ఇందులో రాణించేందుకు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించి ఇంటర్మీడియెట్ నుంచి పీజీ వరకు అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఆయా అంశాలను అప్లికేషన్ ఓరియెంటేషన్, ప్రాక్టికల్ అప్రోచ్‌తో అధ్యయనం చేయాలి. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ అప్రోచ్ ఉపయుక్తంగా ఉంటుంది. దీనివల్ల ప్రశ్నలు ఏ విధంగా అడిగినా సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.
నెట్‌తో ప్రయోజనాలెన్నో..!
- యూజీసీ నెట్‌లో ప్రతిభ చూపి.. తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అవి..
- అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాతో అధ్యాపక వృత్తిలో అడుగు పెట్టొచ్చు. యూజీసీ నిబంధనల ప్రకారం–నెట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో ఉత్తీర్ణత సాధించిన వారినే ఈ పోస్ట్‌లకు ఎంపిక చేయాలి. ఏడో పీఆర్‌సీ సిఫార్సుల ప్రకారం–అసిస్టెంట్ ప్రొఫెసర్ పే స్కేల్‌ను ప్రారంభంలోనే నెలకు బేసిక్ పే రూ.67 వేలు చెల్లించే విధంగా యూజీసీ నిర్ణయించింది.
- జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌నకు (జేఆర్‌ఎఫ్) ఎంపికైతే.. ప్రముఖ రీసెర్చ్ లేబొరేటరీల్లో మూడేళ్లపాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేసే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో మొదటి రెండేళ్లు నెలకు రూ.31 వేలు చొప్పున జేఆర్‌ఎఫ్ అందుతుంది. జేఆర్‌ఎఫ్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఎస్‌ఆర్‌ఎఫ్‌కు అర్హత లభిస్తుంది. ఈ దశలో రెండేళ్లపాటు నెలకు రూ.35 వేల ఫెలోషిప్ పొందొచ్చు. జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు పూర్తి చేసుకున్న వారికి సైంటిస్ట్‌లుగా ప్రభుత్వ విభాగాల్లో కెరీర్ ప్రారంభించే అవకాశం లభిస్తుంది. సైంటిస్ట్‌లుగా ఎంపికైన వారికి.. వారి గ్రేడ్ ఆధారంగా ప్రారంభంలోనే నెలకు రూ.ఎనభై వేల వేతనం పొందే అవకాశాలున్నాయి.
- ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో పీహెచ్‌డీ, రీసెర్చ్ అభ్యర్థుల ఎంపికలో నెట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఉంటుంది.
- నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీతోపాటు నెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి జేఆర్‌ఎఫ్, పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హత లభిస్తుంది.
- ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్‌లలో జేఆర్‌ఎఫ్‌కు ఎంపికై పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పురావస్తు శాఖ, ఆర్థిక గణాంక శాఖలు, సామాజిక, న్యాయ మంత్రిత్వ శాఖ వంటి పలు ప్రభుత్వ శాఖల్లో రీసెర్చ్ స్కాలర్స్‌గా అవకాశాలు లభిస్తాయి.
యూజీసీ నెట్-2024 పరీక్షల షెడ్యూల్ ఇదే..
Tags
- UGC NET 2024 Exam Dates
- UGC NET 2024 Syllabus
- ugc net 2024 schedule
- ugc net 2024 schedule released
- ugc net 2024 schedule released news telugu
- telugu news ugc net 2024 schedule released
- UGC NET
- UGC NET Telugu
- UGC NET Environmental Science
- UGC NET Previous Papers
- UGC NET Computer Science and Applications
- UGC NET Hindi
- UGC NET Management
- UGC NET History
- UGC NET Electronic Science
- UGC NET Commerce
- UGC NET 2024 Live Updates
- UGC NET 2024 News in Telugu
- ugc net june 2024 application form last date
- ugc net 2024 time table
- ugc net 2024 exam dates released new telugu
- ugc net exam date subject wise 2024
- ugc net 2024 admit card
- ugc net 2024 admit card news telugu
- telugu news ugc net 2024 admit card
- ugc net admit card 2024 subject wise
- ugcnet nta nic in 2024
- ugcnet nta nic in 2024 news telugu
- UGC-NET June 2024 schedule
- University Grants Commission exam
- National Eligibility Test 2024
- CBT-based UGC-NET
- National Board of Examinations
- UGC-NET exam date release
- UGC-NET 83 subjects
- sakshieducation latest News Telugu News