Skip to main content

Intercontinental Missile: ఖండాంతర క్షిపణిని పరీక్షించిన చైనా

అమెరికాలోని నగరాలను తాకేంతగా సుదూరాలకు వెళ్లగల సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణి(ఐసీబీఎం)ను చైనా విజయవంతంగా పరీక్షించింది.
China test-fires intercontinental ballistic missile   ICBM launch by China demonstrating military capabilities  Military experts analyze China's ICBM test results  China Conducts First Public Test Launch Of Intercontinental Ballistic Missile

వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలను ప్రపంచానికి చాటే ఉద్దేశంతోనే చైనా ఈ పరీక్ష జరిపిందని అంతర్జాతీయ రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. 

పసిఫిక్‌ మహాసముద్ర జలాల్లో సెప్టెంబ‌ర్ 25వ తేదీ జరిపిన ఈ పరీక్ష తమ ఆయుధ పనితీరు, సైన్యం శిక్షణా సామర్థ్యాలను ప్రదర్శించి నిర్దేశిత లక్ష్యాన్ని చేధించిందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 

పొరుగు దేశాలు ఆందోళన చెందకుండా ముందే రాకెట్‌ ప్రయోగించే దిశ, గమ్యం తదితర వివరాలను వారితో చైనా పంచుకుంది. దశాబ్దాల కాలంలో చైనా బహిరంగంగా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారని చైనా అధికారిక ‘చైనా డైలీ’ వార్తాసంస్థ పేర్కొంది. ఈ క్షిపణి ఎంత దూరం వెళ్తుందో చైనా చెప్పలేదు. ఇది పలు అమెరికా నగరాలనూ తాకగలదని హాంకాంగ్‌ కేంద్రంగా నడిచే సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పేర్కొంది.

SSLV D-3: ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ–3 ప్రయోగం సక్సెస్‌.. కక్ష్యలోకి సురక్షితంగా..

Published date : 26 Sep 2024 01:15PM

Photo Stories