Meta: మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా!.. కారణం ఇదే..
‘యూరోపియన్ యూనియన్ యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మెటా సంస్థపై దాదాపు రూ.6,972 కోట్లమేర పెనాల్టీ విధించాం. నిబంధనలకు విరుద్ధంగా ఫేస్‌బుక్ మార్కెట్ స్పేస్‌ను వినియోగించుకుంటుంది.
ఫేస్‌బుక్‌లో తనకు పోటీగా ఉన్న ఇతర ప్రకటన ఏజెన్సీలకు సంబంధించి ఆన్‌లైన్ క్లాసిఫైడ్ అడ్వర్టైజ్‌మెంట్ సర్వీసెస్‌పై అననుకూల వ్యాపార పరిస్థితులను అమలు చేసింది.
చదవండి: Ecommerce Market: 325 బిలియన్ డాలర్లకు చేరుకోనున్న భారత ఈ-కామర్స్ మార్కెట్.. ఎప్పటిలోపు అంటే..
ఫేస్‌బుక్ వినియోగదారులకు మార్కెట్‌స్పేస్ యాక్సెస్ ఇస్తూ పోటీ వ్యతిరేక విధానాలను అవలబింస్తుంది. దాని ద్వారా ఫేస్‌బుక్ తన మార్కెట్ గుత్తాధిపత్యంతో నిబంధనలను దుర్వినియోగం చేస్తోంది. దాంతోపాటు చట్టవిరుద్ధంగా ఫేస్‌బుక్ వినియోగదారులకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రకటనలను జొప్పిస్తోంది’ అని యురోపియన్ కమిషన్ ఆరోపించింది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
కంపెనీ స్పందన
యురోపియన్ కమిషన్ లేవనెత్తిన ఆరోపణలకు ఎలాంటి రుజువులు లేవని మెటా తెలిపింది. ఈ అంశంపై అప్పీలుకు వెళుతామని స్పష్టం చేసింది.
మెటా తన ప్రకటనదారుల నిబంధనలకు కట్టుబడి ఉందని తెలిపింది. వినియోగదారులు ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌ను అనుసరించాలా వద్దా అనేది పూర్తిగా వారి ఇష్టంపై ఆధారపడుతుందని చెప్పింది. అందులో కంపెనీ ఎలాంటి నియమాలను ఉల్లంఘించలేదని పేర్కొంది.