Ecommerce Market: 325 బిలియన్ డాలర్లకు చేరుకోనున్న భారత ఈ-కామర్స్ మార్కెట్.. ఎప్పటిలోపు అంటే..
ఈ వృద్ధికి గ్రామీణ భారతదేశం ముఖ్య కారణంగా ఉంటుందని నివేదిక పేర్కొంది.
పెరుగుదలకు కారణాలు ఇవే..
పెరిగిన ఇంటర్నెట్ వ్యాప్తి: భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 800 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది. ఇది ఆన్‌లైన్ షాపింగ్‌కు మరింత అవకాశాలను తెరుస్తుంది.
సరసమైన ఇంటర్నెట్ సేవలు: డేటా ధరలు తగ్గడం, రిలయన్స్ జియో వంటి టెలికాం ఆపరేటర్ల నుండి పోటీ పెరగడం వల్ల ఇంటర్నెట్ సేవలు మరింత అందుబాటులోకి వస్తున్నాయి.
స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య పెరుగుదల: భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 700 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది. ఇది మొబైల్ కామర్స్‌కు మరింత ఊపునిస్తుంది.
భారత ఈ-కామర్స్ మార్కెట్ ప్రస్తుతం 70 బిలియన్ డాలర్లు విలువైంది. మొత్తం రిటైల్ మార్కెట్‌లో 7% వాటాను కలిగి ఉంది. 2030 నాటికి, ఈ వాటా 20% పెరుగుతుందని అంచనా వేయబడింది.
Microsoft Invest: 1.7 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్న సత్యనాదెళ్ల.. ఎక్కడ, దేనికంటే..!?