Skip to main content

Social Media: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ఈ బిల్లును ఆమోదించిన ఆస్ట్రేలియా

16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్‌ మీడియా వాడకుండా నిషేధించే బిల్లును ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ న‌వంబ‌ర్ 27వ తేదీ ఆమోదించింది.
Australias House Of Representatives Passes Bill To Ban Social Media for Kids Under 16

ఈ బిల్లు ప్రకారం.. టిక్‌టాక్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, రెడిట్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక వేదికల్లో వారికి ఖాతాలు ఉండకూడదు. 
 
దీన్ని అతిక్రమిస్తే ఏకంగా 3.3 కోట్ల డాలర్ల దాకా జరిమానా విధిస్తారు. ప్రధాన పార్టీలన్నీ బిల్లుకు మద్దతిచ్చాయి. దానికి అనుకూలంగా 102, వ్యతిరేకంగా 13 ఓట్లొచ్చాయి. బిల్లు ఈ వారంలో చట్టంగా మార నుంది. వయోపరిమితుల అమలుకు సామాజిక మాధ్యమాలకు ప్రభుత్వం ఏడాది గడువిచ్చింది. ఆ తర్వాత నుంచి జరిమానాలు విధిస్తారు.

World Oldest Alphabet: ప్రపంచంలో తొలి వర్ణమాలను కనుగొన్న శాస్త్రవేత్తలు!

అమలు ఎలా?
ఈ చట్టాన్ని ఎలా అమలు చేయాల‌న్నది సందేహాస్పదంగా ఉంది. సామాజిక మాధ్యమాలు వినియోగదారుల వయస్సు నిర్ధారించడానికి ప్రభుత్వ గుర్తింపు పత్రాలను డిమాండ్‌ చేయలేవు. దీనిపై విపక్ష సభ్యులు, ముఖ్యంగా డాన్ తెహాన్, చట్టం అమలు అవడం అనుమానమేనని అభిప్రాయపడుతున్నారు.

కొంతమంది విమర్శకులు ఈ బిల్లును లోతుగా పరిశీలించకుండా ఆమోదించినట్టు పేర్కొంటున్నారు. వారు, ఇది పిల్లలకు తల్లిదండ్రుల పర్యవేక్షణ నుండి అదనపు స్వేచ్ఛను తీసుకెళ్లవచ్చని, అలాగే ఈ నిషేధం వల్ల పిల్లలు సామాజిక వేదికల ద్వారా పొందగలిగే సానుకూల అంశాలను మిస్‌ అవుతారని భావిస్తున్నారు.

Indian Students : అమెరికాలో 51 శాతం తెలుగు విద్యార్థులే.. ప్ర‌థ‌మ స్థానంలో..

Published date : 28 Nov 2024 12:30PM

Photo Stories