Skip to main content

Earthquake in Japan: జపాన్‌లో భారీ భూకంపం.. 6.4 తీవ్రత నమోదు

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది.
Strong Earthquake in Japan 6.4 Severity Recording

ఉత్తర మధ్య ప్రాంతంలోని నోటోలో న‌వంబ‌ర్ 26వ తేదీ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నోటో ద్వీపకల్పంలోని పశ్చిమ తీరంలో 10 కి.మీ. (6.2 మైళ్ళు) లోతులో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణశాఖ తెలిపింది.

ఈ ఏడాది ప్రారంభంలో సంభవించిన భారీ భూకంపం నుంచి  కోలుకుంటున్నంతలోనే ఇప్పుడు మరో భూపంపం సంభవించింది. భూకంపం తర్వాత ఎలాంటి సునామీ ముప్పు లేదని తెలుస్తోంది. ఈ భూకంపం కారణంగా ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. 

భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు యూఎస్‌జీఎస్‌ పేర్కొంది. భూకంపానికి సంబంధించిన నష్టం గురించి తక్షణ నివేదికలేవీ లేవు. 2024, జనవరి ఒకటిన నోటో ప్రాంతంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. నాటి దుర్ఘటనలో 370 మందికి పైగా జనం మృతిచెందారు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. 

COP29 Summit: వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు.. 300 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ఒప్పందం

Published date : 27 Nov 2024 03:23PM

Photo Stories