Skip to main content

Jay Bhattacharya: అమెరికా ఎన్ఐహెచ్ డైరెక్టర్‌గా జయ్ భట్టాచార్య

భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త జయ్ భట్టాచార్య అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్) డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
 Jay Bhattacharya as National Institutes of Health director

ఇది అమెరికాలో అత్యున్నత వైద్య పరిశోధన సంస్థ. అలాగే ఇతర ప్రయోగశాలకు నిధులను కూడా దీని ద్వారానే కేటాయిస్తారు. ట్రంప్ 2.0లో పాలనాపరమైన పోస్టుల్లో నియమితులైన తొలి భారతీయ సంతతి వ్యక్తిగా భట్టాచార్యను పేర్కొనవచ్చు. 

పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన భట్టాచార్య 1968లో కోల్‌కతాలో జన్మించారు. ఎంబీబీఎస్ అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. 1997లో స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి మెడిసిన్‌లో డాక్టరేట్, ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తిచేసి అక్కడే స్థిరపడ్డారు. కొవిడ్‌ సమయంలో జో బైడెన్‌ ప్రభుత్వ పాలసీని తీవ్రంగా విమర్శించిన భట్టాచార్య రిపబ్లికన్లకు దగ్గరయ్యారు. భట్టాచార్య ప్రస్తుతం స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ మెడికల్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు.

Scott Bessent: ఆర్థిక మంత్రిగా ఎంపికైన‌ స్కాట్‌ బెసెంట్

ఎన్ఐహెచ్‌ ఒక కీలక సంస్థగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది 27 వైద్య పరిశోధన సంస్థలకు నిధులు కేటాయిస్తుంటుంది. ఎన్ఐహెచ్‌ ఏడాది బడ్జెట్ సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందట. భట్టాచార్య ఈ సంస్థ ద్వారా ప్రజారోగ్యం మెరుగుపర్చడంపై తన కృషిని కేంద్రీకరించనున్నారు.

అలాగే.. ఇటీవల‌ ట్రంప్‌ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా ఆర్‌ఎఫ్‌కెన్నెడీ జూనియర్‌ నియమితుల‌య్యారు. ఇప్పటికే భారత సంతతి వ్యాపారవేత్త వివేక్‌రామస్వామి ట్రంప్‌ టీమ్‌లో ఇలాన్‌ మస్క్‌తో పాటు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియె‌న్సీ(డీవోజీఈ) హెడ్‌ పదవికి ఎంపిక‌య్యాడు. 

Brooke Rollins: అమెరికా వ్యవసాయ మంత్రిగా బ్రూక్‌ రోలిన్స్

Published date : 28 Nov 2024 01:53PM

Photo Stories