Skip to main content

Brooke Rollins: అమెరికా వ్యవసాయ మంత్రిగా బ్రూక్‌ రోలిన్స్

చిరకాల మిత్రురాలు బ్రూక్‌ రోలిన్స్‌ను వ్యవసాయ మంత్రిగా డోనాల్డ్‌ ట్రంప్‌ నామినేట్‌ చేశారు.
Donald Trump selects Brooke Rollins as next agriculture secretary

రిపబ్లికన్ల థింక్‌ టాంక్‌ అమెరికా ఫస్ట్‌పాలసీ ఇనిస్టిట్యూట్‌ అధిపతిగా ఉన్న బ్రూక్‌ నియామకంతో కేబినెట్‌ జాబితా దాదాపు పూర్తయ్యింది. దేశానికి నిజమైన వెన్నెముక అయిన అమెరికా రైతులను రక్షించేందుకు బ్రూక్‌ నాయకత్వం వహిస్తారని ఆయన తెలిపారు.

అమెరికా ఫస్ట్‌ అధ్యక్షురాలిగా ఉన్న బ్రూక్స్‌ ట్రంప్‌ మిత్రురాలు. ట్రంప్‌ తొలి పర్యాయంలో వైట్‌హౌస్‌ సహాయకురాలిగా పనిచేశారు. ఆఫీస్‌ ఆఫ్‌ అమెరికన్‌ ఇన్నోవేషన్‌ డైరెక్టర్‌గా, డొమెస్టిక్‌ పాలసీ కౌన్సిల్‌ తాత్కాలిక డైరెక్టర్‌గా పనిచేశారు. వ్యవసాయ అనుబంధ కుటుంబం నుంచి వచ్చిన రోలిన్స్‌.. దేశవ్యాప్త వ్యవసాయ క్లబ్‌ అయిన 4హెచ్‌తో పాటు ఫ్యూచర్‌ ఫార్మర్స్‌ ఆఫ్‌ అమెరికాతోనూ మంచి సంబంధాలను కలిగి ఉన్నారు. 

Scott Bessent: ఆర్థిక మంత్రిగా ఎంపికైన‌ స్కాట్‌ బెసెంట్

టెక్సాస్‌ ఏ అండ్‌ ఎం యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ డిగ్రీ అందుకున్న ఆమె తరువాత న్యాయవాదిగానూ పనిచేశారు. అమెరికా, కెనడా, మెక్సికో దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని పునఃసమీక్షించడంలోనూ కీలక పాత్ర పోషించనున్నారు. రోలిన్స్‌ ఎంపికతో ట్రంప్‌ కేబినెట్‌ జాబితా ఎంపిక దాదాపు పూర్తయ్యింది. ప్రతి అభ్యర్థిని సెనేట్‌ ధ్రువీకరించాల్సి ఉంటుంది. 15 మంది సలహాదారుల బృందం అమెరికన్‌ ప్రభుత్వంలో ఒక బ్యూరోక్రటిక్‌ విభాగానికి నాయకత్వం వహిస్తుంది.

ట్రంప్‌ టీమ్‌లోకి మరో భారతీయుడు 
ట్రంప్‌ అధికార బృందంలో మరో భారతీయుడు చేశారు. కోల్‌కతాలో పుట్టిన జై భట్టాచార్యను అమెరికా హెల్త్‌ ఏజెన్సీ డైరెక్టర్‌గా ట్రంప్‌ ఎంపిక చేశారు. స్టాన్‌ఫర్డ్‌లో చదివిన భట్టాచార్య వైద్యుడు, ఆర్థికవేత్త. ఎన్‌ఐహెచ్‌ను మార్చే ఆలోచనలను కాబోయే ఆరోగ్య మంత్రి రాబర్ట్‌ ఎఫ్‌ కెనెడీ జూనయర్‌తో ఆయన ఇటీవల పంచుకున్నారు. అనంతరం ఆయనను ట్రంప్‌ తన టీమ్‌లోకి ఎంపిక చేశారు.

Pam Bondi: అమెరికా అటార్నీ జనరల్‌గా పామ్‌ బోండీ

Published date : 25 Nov 2024 06:06PM

Photo Stories