Skip to main content

Divith Reddy: ప్రపంచ క్యాడెట్ చెస్ చాంప్ దివిత్ రెడ్డి

ప్రపంచ క్యాడెట్స్ చెస్ చాంపియన్ షిప్‌లో అండర్-8 ఓపెన్ విభాగంలో భారతకు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ కుర్రాడు ఆదుళ్ల దివిత్ రెడ్డి చాంపియన్‌గా అవతరించాడు.
Divith Reddy Becomes World Under-8 Chess Champion

నిర్ణీత 11 రౌండ్ల తర్వాత ఎనిమిదేళ్ల దివిత్ రెడ్డితోపాటు స్వయిన్ సాత్విక్ (భారత్), జిమింగ్ గువో (చైనా) 9 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా తెలంగాణకు చెందిన దివిత్ రెడ్డికి టాప్ ర్యాంక్ దక్కింది. 

ఒడిశాకు చెందిన స్వయిన్ సాత్వికకు రెండో స్థానం, జిమింగ్ గువోకు మూడో స్థానం ఖరారయ్యాయి. దివిత్ రెడ్డి ఆడిన 11 గేమ్స్‌లో తొమ్మిదింటిలో గెలిచి, రెండింటిలో ఓడిపోయాడు. ఈ ఏడాది ఏప్రిల్ అల్బేనియాలో జరిగిన వరల్డ్ క్యాడెట్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో దివిత్ రెడ్డి అండర్-8 విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు.

ATP Challenger Title: రిత్విక్ జోడీకి రొవరెటో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టైటిల్

Published date : 28 Nov 2024 11:48AM

Photo Stories