ATP Finals: ఏటీపీ ఫైనల్స్ టోర్నీ టైటిల్ విజేత యానిక్ సినెర్.. ఇదే తొలిసారి
అమెరికా ప్లేయర్, యూఎస్ ఓపెన్ రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్‌తో జరిగిన సింగిల్స్ ఫైనల్లో సినెర్ 6–4, 6–4తో గెలుపొందాడు. 84 నిమిషాలపాటు జరిగిన ఈ తుది సమరంలో సినెర్ 14 ఏస్‌లు సాధించాడు.
టోర్నీ మొత్తంలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా విజేతగా నిలిచినందుకు సినెర్ 48,81,100 డాలర్ల (రూ.41 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీ, 1500 ర్యాంకింగ్ పాయింట్లు గెల్చుకున్నాడు.
టేలర్ ఫ్రిట్జ్‌కు 22,47,400 డాలర్ల (రూ.18 కోట్ల 96 లక్షలు) ప్రైజ్‌మనీ, 800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 2006లో జేమ్స్ బ్లేక్ తర్వాత ఏటీపీ ఫైనల్స్ టోర్నీ తుది పోరులో ఆడిన అమెరికన్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన ఫ్రిట్జ్ కీలక సమరంలో తడబడ్డాడు. ఒకవేళ ఫ్రిట్జ్ గెలిచి ఉంటే 1999లో సంప్రాస్ తర్వాత ఏటీపీ ఫైనల్స్ టైటిల్ సాధించిన అమెరికా ప్లేయర్‌గా గుర్తింపు పొందేవాడు.
Magnus Carlsen: టాటా స్టీల్ చెస్ ఇండియా బ్లిట్జ్ టోర్నమెంట్ విజేత మాగ్నస్ కార్ల్‌సన్
మరోవైపు ఇవాన్ లెండిల్ (1986లో; చెక్ రిపబ్లిక్/అమెరికా) తర్వాత ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా ఘనత వహించాడు. 2024 ఏడాదిని సినెర్ 70 విజయాలు, 6 పరాజయాలతో ముగించాడు. ఆండీ ముర్రే (బ్రిటన్; 2016లో) తర్వాత ఒకే సీజన్‌లో 70 విజయాలు సాధించిన ప్లేయర్‌గా సినెర్ నిలిచాడు.
ఈ ఏడాదిలో సినెర్ 8 టైటిల్స్ సాధించాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ, రోటర్‌డామ్ ఓపెన్, మయామి మాస్టర్స్, హాలె ఓపెన్, సిన్సినాటి మాస్టర్స్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ, షాంఘై మాస్టర్స్, ఏటీపీ ఫైనల్స్ టోర్నీలలో సినెర్ విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా సినెర్ కెరీర్‌లో 18 టైటిల్స్ నెగ్గాడు.
ICC Test Rankings: దశాబ్దకాలం తర్వాత విరాట్ కోహ్లి చేదు అనుభవం.. టాప్-20 నుంచి ఔట్