Rajya Sabha: ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఖాళీ అయిన ఆరు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సుమన్ కుమార్ నవంబర్ 26వ తేదీ విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు స్థానాలు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, హరియాణాల్లో ఒక్కో సీటుకు ఎన్నికలు జరగనున్నాయి.
వైఎస్సార్ సీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ర్యాగ కృష్ణయ్య ఆగస్టు నెలలో తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను రాజ్యసభ చైర్మన్ ఇటీవల ఆమోదించారు.
అలాగే.. ఒడిశాకి చెందిన సుజీత్ కుమార్, పశ్చిమ బెంగాల్‌కి చెందిన జవహర్ సర్కార్, హరియాణాకి చెందిన కృష్ణన్ లాల్పన్వార్ కూడా రాజీనామా చేశారు.
ఎన్నికల షెడ్యూల్ ఇదే..
- నోటిఫికేషన్ విడుదల: డిసెంబర్ 3
- నామినేషన్ల స్వీకరణ: డిసెంబర్ 10
- నామినేషన్ల ఉపసంహరణ: డిసెంబర్ 13
- పోలింగ్: డిసెంబర్ 20వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
Constitution of India: నేడు రాజ్యాంగ దినోత్సవం.. దీని నేపథ్యం ఇదే..
Published date : 27 Nov 2024 04:45PM