Skip to main content

UGC NET 2024 Notification: యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌)–2024 నోటిఫికేషన్‌ విడుదల..

యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌)–2024 నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. ఈ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తుంది. యూనివర్శిటీల్లో జూనియర్‌ రీసెర్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు, పీహెచ్‌డీలో ప్రవేశాలకు ఈ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తుంటారు.
ugc net 2024 notification and eligibility and exam pattern and syllabus and exam date

సబ్జెక్ట్‌లు: అడల్డ్‌ ఎడ్యుకేషన్, ఆంత్రోపాలజీ, అరబ్‌ కల్చర్‌ అండ్‌ ఇస్లామిక్‌ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్, కంప్యూటర్‌ సైన్స్, క్రిమినాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, ఇంగ్లిష్, హోం సైన్స్, హిస్టరీ, ఫోరెన్సిక్‌ సైన్స్, ఇండియన్‌ కల్చర్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్, లింగ్విస్టిక్స్, మ్యూజిక్, సైకాలజీ, లా తదితరాలు.
అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ–ఎన్‌సీఎల్‌/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్‌ జెండర్‌ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు అవసరం.
వయసు: జేఆర్‌ఎఫ్‌కు 01.06.2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు గరిష్ట వయోపరిమితి లేదు.

పరీక్ష విధానం: ఓఎమ్మార్‌ ఆధారిత విధానంలో పరీక్ష  ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్‌ టైప్, మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌–1లో 50 ప్రశ్నలు(100 మార్కులు), పేపర్‌–2లో 100 ప్రశ్నలు(200 మార్కులు) కేటాయించారు. పరీక్షకు మూడు గంటల వ్యవధి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 20.04.2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.05.2024
పరీక్ష ఫీజు చెల్లింపుకు చివరితేది: 12.05.2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 13.05.2024 నుంచి 15.05.2024వరకు
పరీక్ష తేది: 16.06.2024.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ugcnet.nta.ac.in/

చదవండి: Admissions in SVNIRTAR: ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌–కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌–2024 నోటిఫికేషన్‌ విడుదల..

Published date : 23 Apr 2024 04:11PM

Photo Stories