Skip to main content

AP TET 2024 Exams: అక్టోబర్‌ 3 నుంచి టెట్‌ పరీక్షలు.. ఆ అభ్యర్థులకు 50 నిమిషాలు అదనంగా..

AP TET 2024 Exams  District Education Officer D. Subhadra announces Teacher's Eligibility Test (TET) schedulexamination centers selected for TET in Ongolu district  TET exam schedule

ఒంగోలు: టీచర్స్‌ ఎలిజిబులిటీ టెస్టు (టెట్‌) పరీక్షలను అక్టోబర్‌ 3 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి.సుభద్ర తెలిపారు. ఇందు కోసం జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

KGBV Recruitment 2024: కేజీబీవీ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం..

జిల్లాలోని పెద్దారవీడు మండలం దరిమడుగులోని కృష్ణచైతన్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌, డాక్టర్‌ శామ్యూల్‌ జార్జి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, స్థానిక మంగమూరు జంక్షన్‌ సమీపంలోని మామిడిపాలెంలో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ది చర్చి సోషల్‌ యాక్షన్‌ ఇండియా, స్థానిక నెల్లూరు బస్టాండులోని డీఐజీ సొసైటీ కాంప్లెక్స్‌లోని బ్రిలియంట్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ ఆవరణలో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు.

ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షలకు అభ్యర్థులు గంటన్నర ముందుగా హాజరుకావాలన్నారు. సెల్‌ఫోన్లు, జామెంట్రీ బాక్సులు, బ్యాగులు, ఎలక్ట్రికల్‌ డివైజ్‌లను అనుమతించడం జరగదన్నారు. ఎవరైనా పీహెచ్‌సీ అభ్యర్థి పేరు స్క్రైబ్‌ జాబితాలో లేకపోతే లేదా దరఖాస్తులో పీహెచ్‌సీ వివరాలు లేకపోతే వారు జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్రదిస్తే.. అర్హత మేరకు స్క్రైబ్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

Job Mela: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలు ఇవే

విజువల్లీ ఛాలెంజ్డ్‌/ఆర్దోపెడికల్లీ ఛాలెంజ్డ్‌ (రెండు చేతులు లేనివారు) అభ్యర్థుల విషయంలో నిబంధనల ప్రకారం 50 నిముషాల సమయం అదనంగా కేటాయిస్తామన్నారు. హాల్‌ టికెట్లపై నో ఫొటోగ్రాఫ్‌ ఉన్న అభ్యర్థులు తాజాగా వారి ఫొటోగ్రాఫ్‌తో ఉన్న గుర్తింపు కార్డు చూపిస్తే పరీక్షకు అనుమతించడం జరుగుతుందన్నారు.

నామినల్‌ రోల్స్‌లో అభ్యర్థి పేరు/తండ్రిపేరు, లింగం వంటి చిన్న స్పెల్లింగ్‌ తప్పులను మార్చుకునేందుకు అభ్యర్థులు టెట్‌ పరీక్ష కేంద్రంలోని డిపార్టుమెంటల్‌ అధికారులను సంప్రదించాలన్నారు. మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి పరీక్ష ఉన్న ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు.

B.Tech/M.Tech Exam Results: బీటెక్‌/ఎంటెక్‌ 4th సెమిస్టర్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో టెట్‌ గ్రీవెన్స్‌సెల్‌ కూడా ఏర్పాటు చేశామన్నారు. ఏమైనా సమస్యలుంటే పరీక్షల విభాగం సహాయ కమిషనర్‌ కె.శివకుమార్‌ (8125264606/9701000346), అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఉదయభాస్కర్‌ (8919121853), అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ జె.కృష్ణకుమార్‌ (9246460656)ను సంప్రదించాలని డీఈవో సూచించారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 27 Sep 2024 03:29PM

Photo Stories