AP TET Exam Centers : ఏపీ టెట్‌కు మూడు సెంటర్ల ఏర్పాటు..
నంద్యాల: జిల్లాలో ఏపీ టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (2024)కి మూడు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు డీఈఓ సుధాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు జరిగే పరీక్షలకు 8,870 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
అయ్యలూరు మెట్ట సమీపంలోని ఎస్‌వీఆర్ ఇంజినీరింగ్ కాలేజీ, నెర్రవాడలోని శాంతిరాం ఇంజినీరింగ్ కాలేజీ, ఆర్‌జీఎం ఇంజినీరింగ్ కాలేజీలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షకు సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరన్నారు.
Scholarships Program : సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో ఉపకార వేతనాల పండుగ
నామినల్ రోల్స్‌లో వివరాలు మార్చుకునేందుకు తగిన ధ్రువపత్రాలతో టెట్ పరీక్ష కేంద్రంలోని డిపార్టుమెంటల్ అధికారులను సంప్రదించాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే డిప్యూటీ డీఈఓ మహబూబ్‌బేగ్ (సెల్: 9440360042), ఏఎస్‌ఓ కైసర్ అహమ్మద్ (8179855575)ను సంప్రదించాలన్నారు. డీఈఓ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు.