Skip to main content

Scholarships Program : సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో ఉప‌కార వేత‌నాల పండుగ‌

కానూరు వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీ డీమ్డ్‌ టు బీ యూనివర్సిటీలో శుక్రవారం ఉపకార వేతనాల పండుగను ఘనంగా నిర్వహించారు.
Merit scholarships award ceremony at siddhartha engineering college

పెనమలూరు: ప్రతిభ కలిగిన విద్యార్థులకు అండగా ఉండి వారికి ఉపకార వేతనాలు అందజేస్తామని సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు తెలిపారు. కానూరు వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీ డీమ్డ్‌ టు బీ యూనివర్సిటీలో శుక్రవారం ఉపకార వేతనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తమ కాలేజీలో మంచి ప్రతిభ చూపిన 485 మంది ఉత్తమ విద్యార్థులకు రూ 1,50,90,000 ఉపకార వేతనాలు పంపిణీ చేశారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులలో ప్రమాణాలు పెంచటానికి, ఆర్థికంగా సహకరించటానికి యాజమాన్యం కృషి చేస్తుందన్నారు.
School Annual Inspection : ఈ పాఠ‌శాల‌లో 14 ఏళ్ల త‌ర్వాత వార్షిక త‌నిఖీ..!
ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఏవీ రత్నప్రసాద్‌ మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్‌, ఈఏపీసెట్‌, ఇంటర్‌ మార్కులు, సిద్ధార్థలో ఎంట్రన్‌ మార్కుల ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి ఉపకార వేతనాలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఎం.రవిచంద్ర, వివిధ డిపార్టుమెంట్‌ల హెచ్‌వోడీలు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 28 Sep 2024 03:54PM

Photo Stories