Skip to main content

CSIR-UGC NET 2024 Notification: సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ డిసెంబర్‌-2024కు నోటిఫికేషన్‌ విడుదల..

సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌) డిసెంబర్‌-2024కు నోటిఫికేషన్‌ విడుదలైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఈ పరీక్షను నిర్వహించనుంది. సైన్స్‌ రంగంలో పరిశోధనలు, బోధన రంగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్, పీహెచ్‌డీలో ప్రవేశాల ప్రవేశాలతో పాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియామకానికి అర్హత లభిస్తుంది. ప్రతి ఏటా రెండుసార్లు (జూన్, డిసెంబర్‌) ఈ పరీక్ష జరుగుతుంది. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
CSIR-UGC NET 2024 Notification  Apply for CSIR-UGC NET Assistant Professor Eligibility  CSIR-UGC NET Exam Eligibility for Assistant Professor   CSIR-UGC NET December-2024 Notification
CSIR-UGC NET 2024 Notification csir ugc net december 2024 notification

సబ్జెక్టులు: పరీక్షను ఐదు సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. కెమికల్‌ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్‌ సైన్సెస్, మ్యాథమేటికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్‌.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ తత్సమాన ఉత్తీర్ణులు/నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌ ఎంఎస్‌/బీఈ/బీటెక్‌/బీఫార్మసీ/ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ(ఎన్‌సీఎల్‌), ఎస్సీ, ఎస్టీ, థర్డ్‌జెండర్, దివ్యాంగ అభ్యర్థులు అర్హత పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు పొందాలి.

వయసు: జేఆర్‌ఎఫ్‌కు అర్హతకు సంబంధించి జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు ఫిబ్రవరి 2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

Job Fair 2024 For Freshers: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగం


పరీక్ష విధానం: పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల పద్ధతిలో పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రంలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి.

ముఖ్య సమాచారం:

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30-12-2024.

Employment Fair 2024: టెన్త్‌ అర్హతతో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ వివరాలు ఇవే

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 31-12-2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 01-01-2025 నుంచి 02-01-2025 వరకు.

పరీక్ష తేదీలు: 16-02-2025 నుంచి 28-02-2025. 
వెబ్‌సైట్‌: https://csirnet.nta.nic.in/, https://www.nta.ac.in/

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 16 Dec 2024 09:53AM
PDF

Photo Stories