Skip to main content

AP TET 2024 Exams : ఈనెల 3 నుంచి టెట్‌ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

AP TET 2024 Exams Bhimavaram TET exam center at DNR College of Engineering and Technology  DRO J. Udayabhaskara Rao reviews TET exam results
AP TET 2024 Exams

భీమవరం: జిల్లాలో ఏపీ టీచర్స్‌ ఎలిజిబిలిటీ పరీక్షల (టెట్‌) నిర్వహణకు మూడు కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు డీఆర్వో జె.ఉదయభాస్కరరావు తెలిపారు. సోమవా రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పరీక్షల ఏ ర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈనెల 3 నుంచి 21 వరకు భీమవరం డీఎన్‌ఆర్‌ కాలేజ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, డీఎన్‌ఆర్‌ అటానమస్‌, తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇంజనీరింగ్‌ కాలేజీ కేంద్రాల్లో టెట్‌ పరీక్షలు జరుగుతున్నాయన్నారు.

Dussehra Holidays 2024 : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రేపటి నుంచి దసరా సెలవులు

జిల్లా నుంచి 2,617 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసు కున్నారని, పరీక్షలకు ఒక్క నిమిషము ఆలస్యమై నా అనుమతించమని అన్నారు. ముగ్గురు డిపార్టమెంటల్‌ అధికారులు, రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. డీఈఓ జి.నాగమణి, విద్యా శాఖ సహాయ సంచాలకుడు ఎం.సత్యనారాయణ, డీఎంహెచ్‌ఓ డి.మహేశ్వరరావు పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 01 Oct 2024 04:06PM

Photo Stories