Skip to main content

Dussehra Holidays 2024 : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి దసరా సెలవులు

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి పాఠశాలలకు సెలవులు ఉండడంతో విద్యార్థులు తెగ ఖుషీలో మునిగిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండగైన దసరా పండగ సెలవులను ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. రేపు గాంధీ జయంతి(అక్టోబర్‌2) కాగా ఎలాగో సెలవు ఉండనుంది. దీంతో తెలంగాణ‌లోని అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూళ్లకు అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది.
Dussehra Holidays 2024
Dussehra Holidays 2024

TG DSC 2024 Results District-Wise Vacancy Posts: డీఎస్సీ ఫలితాల్లో ఈసారి రికార్డ్‌.. జిల్లాల వారీగా ఖాళీల లిస్ట్‌ చెక్‌ చేసుకోండిలా

పాఠశాలలు తిరిగి 15వ తేదీన తెరుచుకుంటాయని పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ అక్టోబర్‌ 3 నుంచి 13 వరకు దసరా సెలవులను ప్రకటించారు. ముందుగా అక్టోబర్ 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మొత్తం 10 రోజులు దసరా సెలవులను ఇవ్వాలనుకున్నారు. అయితే తెలంగాణలో అక్టోబర్‌ 3 నుంచే దసరా సెలవులు ఇవ్వడంతో ఏపీలోనూ ఒకరోజు ముందునుంచే స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు విద్యామంత్రి లోకేశ్‌ ప్రకటించారు.

Dussehra Holidays 2024

AP TET 2024 Exams : ఈనెల 3 నుంచి టెట్‌ పరీక్షలు... హాల్‌టికెట్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారా?

ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు అదనంగా అక్టోబర్‌ 3 నుంచి సెలవులను ఇచ్చారు. ఏపీలో సెలవుల అనంతరం తిరిగి పాఠశాలలు అక్టోబర్‌ 13న తెరుచుకోనున్నాయి. కాగా ప్రైవేటు యాజమాన్యాలు సెలవుల్లో తరగతులు నిర్వమిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 02 Oct 2024 09:55AM

Photo Stories