Skip to main content

AAPAR Card : అపార్ కోసం స్కూల్ రికార్డు మార్చ‌డం స‌రికాదు!

No changes in students details in school records for aapar cards  Nallapalli Vijaybhaskar discusses Aadhaar changes for Apar registration

అనంతపురం ఎడ్యుకేషన్‌: ‘అపార్‌’ నమోదు కోసం విద్యార్థుల ఆధార్‌లో మార్పులు చేయాల్సిందిపోయి.. స్కూల్‌ రికార్డులు మార్చడానికి విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నల్లపల్లి విజయ్‌భాస్కర్‌ మండిపడ్డారు. శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా విద్యార్థులందరికీ ఒకే గుర్తింపు కార్డు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆటోమెటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ (అపార్‌) అమలు చేస్తోందని పేర్కొన్నారు. అపార్‌ జనరేట్‌ కావాలంటే స్కూల్‌ రికార్డు, యూడైస్‌, ఆధార్‌ ఇలా మూడింటిలోనూ వివరాలు ఒకే విధంగా ఉండాలన్నారు.

Job Mela: 13వ తేదీ జాబ్‌మేళా.. ఈ అర్హతలు ఉంటే చాలు

స్కూల్‌ రికార్డ్‌, యూడైస్‌లో ఒకే విధంగా ఉన్నా ఆధార్‌కార్డులో మరో విధంగా ఉండటంతో ఆపార్‌ నమోదు ఆలస్యమవుతోందన్నారు. విద్యార్థులకు ప్రతి విషయంలోనూ స్కూల్‌ రికార్డు మాత్రమే ప్రామాణికంగా ఉంటుందన్నారు. అయితే అపార్‌ నమోదుకు పాఠశాల రికార్డులు మార్పు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం బాధాకరమన్నారు. తగినంత సమయం ఇచ్చి ప్రతి సచివాలయంలోనూ ఆధార్‌ అప్‌డేషన్‌ కేంద్రం ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికై నా ఆధార్‌కు అనుగుణంగా స్కూల్‌ రికార్డులు మార్పు చేయాలనే ఉత్తర్వులను రద్దు చేసి ఆధార్‌కార్డుల సవరణకు సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 09 Nov 2024 11:52AM

Photo Stories