Skip to main content

Job Mela: 13వ తేదీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్‌మేళా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామ రాజు జిల్లాలో న‌వంబ‌ర్ 13వ తేదీ తేదీ జాబ్‌మేళా జ‌ర‌గ‌నుంది.
Job Mela in Andhra Pradesh at Alluri Sitharamaraju District  jobmela at araku iti job opportunities in Andhra Pradesh

పాడేరు: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, సీ డాప్‌ ఆధ్వర్యంలో న‌వంబ‌ర్‌ 13న అరకు ఆర్‌ ఐటీఐలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్‌ పి.రోహిణి ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ జాబ్‌మేళాలో పారడైస్‌ ఫుడ్‌కోర్టు, విన్నగ్‌ సాఫ్ట్‌ సొల్యూషన్‌, మెడ్‌ప్లస్‌, పీవీఆర్‌ ఐనాక్స్‌ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. జిల్లాలో 18 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల వయసు గల టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ ఆపై పాసైన నిరుద్యోగ యువతీ యువకులు హాజరు కావాలన్నారు. 

ఇంటర్వ్యూలకు విచ్చేసే అభ్యర్థులు పాన్‌, ఆధార్‌కార్డులతోపాటు విద్యార్హత ధ్రువీకరణ పత్రాల జెరాక్స్‌ కాపీలు తీసుకురావాలని కోరారు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు వేతనం ఇవ్వనున్నట్టు చెప్పారు. పూర్తి వివరాలకు 9491057527, 9398338105 నంబర్లలో సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.

Job Mela: 11వ తేదీ జాబ్‌మేళా.. స‌ద్వినియోగం చేసుకోండి

Published date : 08 Nov 2024 06:13PM

Photo Stories