Open School Admissions: ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలకు గడువు పెంపు.. ఎప్పటివరకంటే
Sakshi Education
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి, ఇంటర్మీడియెట్ 2024–25 విద్యాసంవత్సరం ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు పెంచినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు మంగళవారం తెలిపారు. ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా రూ.600 అపరాధ రుసుంతో ప్రవేశాలు పొందవచ్చన్నారు.
Open School Admissions
విద్యార్థులు దరఖాస్తులు, సంబంధిత స్టడీసెంటర్ నుంచి ఉచితంగా పొంది వాటిని పూరించి కో ఆర్డినేటర్ ద్వారా తప్పులు సరిచూసుకుని ఏపీ ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. స్టడీసెంటర్‌లో ఎటువంటి ఫీజు చెల్లించనవసరంలేదన్నారు. దళారులను నమ్మవద్దని, సమీప ఏఐ కేంద్రాలను, జిల్లా కో ఆర్డినేటర్‌ను ఫోన్ నంబర్ 89776 45704 లో సంప్రదించాలన్నారు.