Skip to main content

GAIL jobs: డిగ్రీ అర్హతతో గెయిల్‌లో 261 ఉద్యోగాలు నెలకు జీతం 160000

GAIL jobs  GAIL job notification 2024   GAIL 261 job openings in E1 and E2 grade GAIL New Delhi recruitment announcement
GAIL jobs

న్యూఢిల్లీలోని మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ- గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్‌ వర్క్ సెంటర్లు/ యూనిట్‌లలో కింది విభాగాల్లో ఈ1, ఈ2 గ్రేడ్‌ కేడర్‌లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 261 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్‌ 11వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

10వ తరగతి అర్హతతో రైల్వేలో 7438 ఉద్యోగాలు: Click Here

మొత్తం ఖాళీల సంఖ్య : 261
సీనియర్ ఇంజినీర్ (రెన్యూవబుల్ ఎనర్జీ) పోస్టులు : 06
సీనియర్ ఇంజినీర్ (బాయిలర్ ఆపరేషన్స్) పోస్టులు : 03
సీనియర్ ఇంజినీర్ (మెకానికల్) పోస్టులు : 30
సీనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు : 06
సీనియర్ ఇంజినీర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) పోస్టులు : 01
సీనియర్ ఇంజనీర్ (కెమికల్) పోస్టులు : 36
సీనియర్ ఇంజినీర్ (గెయిల్‌టెల్‌- టీసీ/టీఎం) పోస్టులు : 05
సీనియర్ ఆఫీసర్ (ఫైర్ అండ్‌ సేఫ్టీ) పోస్టులు : 20
సీనియర్ ఆఫీసర్ (సీ అండ్‌ పీ) పోస్టులు : 22
సీనియర్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు : 11
సీనియర్ ఆఫీసర్ (మార్కెటింగ్) పోస్టులు : 22
సీనియర్ ఆఫీసర్ (ఫైనాన్స్ అండ్‌ అకౌంట్స్) పోస్టులు : 36
సీనియర్ ఆఫీసర్ (హ్యూమన్‌ రిసోర్స్‌) పోస్టులు : 23
సీనియర్ ఆఫీసర్ (లా) పోస్టులు : 02
సీనియర్ ఆఫీసర్ (మెడికల్ సర్వీసెస్) పోస్టులు : 01
సీనియర్ ఆఫీసర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్) పోస్టులు : 04
ఆఫీసర్ (ల్యాబొరేటరీ)పోస్టులు : 16
ఆఫీసర్ (సెక్యూరిటీ) పోస్టులు : 04
ఆఫీసర్ (అఫీషియల్‌ లాంగ్వేజ్‌) పోస్టులు : 13

ఇతర ముఖ్యమైన సమాచారం:
అర్హత: పోస్టులను అనుసరించి బీఏ, బీకాం, బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీబీఎస్‌, ఎమ్మెస్సీ, సీఏ, సీఎంఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: సీనియర్ ఆఫీసర్ (మెడికల్ సర్వీసెస్)/ ఆఫీసర్ (ల్యాబొరేటరీ) పోస్టులకు 32 ఏళ్లు.. ఆఫీసర్ (సెక్యూరిటీ) పోస్టులకు 45 ఏళ్లు.. ఆఫీసర్ (అఫీషియల్‌ లాంగ్వేజ్‌) పోస్టులకు 35 ఏళ్లు.. ఇతర పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు. ఆయా కేటగిరీల వారీగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

పే స్కేల్: నెలకు సీనియర్ ఇంజినీర్/ సీనియర్ ఆఫీసర్ పోస్టులకు రూ.60,000- రూ.1,80,000.. ఆఫీసర్ పోస్టులకు రూ.50,000- రూ.1,60,000 వరకు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: గ్రూప్ డిస్కషన్, ఫిజికల్ ఫిటెనెస్‌ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌లు రిజిస్ట్రేషన్లు ప్రారంభ తేది: నవంబర్‌ 12, 2024
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: డిసెంబర్‌ 11, 2024

Published date : 20 Nov 2024 08:23AM
PDF

Photo Stories