Tenth Board Exams Preparation Classes : పదో తరగతి విద్యార్థులకు అదనపు తరగతులు.. ఇవి తప్పకుండా పాటించండి..

సాక్షి ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఈసారి నూరు శాతం ఉత్తీర్ణత సాధించి, ఉన్నత ర్యాంకులు రాణించాలని విద్యాశాఖ తెలిపింది. అలాగే, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులపై ప్రత్యేక దృష్టిని సారించి, వారు వెనకబడిన సబ్జెక్టుల్లో ఉన్నతంగా రాణించాలని ప్రోత్సాహించాలని కోరింది. విద్యార్థులు, పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్రతీ విద్యార్థి పరీక్షలో ఉన్నత మార్కులు సాధించాలని కోరారు.
సమయ పాలన..
విద్యార్థులకు వారి పాఠశాలలో నిర్ణీత సమయం కన్నా అదనంగా సమయం వెచ్చించి వారికి స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు ఉపాధ్యాయులు. విద్యార్థులు వెనకబడి ఉన్న సబ్జెక్టుల్లో రాణించేలా, ఉన్నత మార్కులకు కృషి చేయాలని వారి ప్రోత్సాహిస్తూ.. ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు విద్యార్థులను పాఠశాలలోనే చదివిస్తున్నారు.
సాధరంగా, విద్యార్థులకు పాఠశాల సమయం కేవలం 6 గంటలు మాత్రమే ఉంటుంది. కానీ, ఇది పరీక్షల సమయంగా కాగా, విద్యార్థుల్లో చాలామంది కొన్ని సబ్జెక్టుల్లో వెనకబడి, కొందరు చదవక ఉంటారు. వారి కోసమే ఈ ప్రత్యేక తరగతులు. దీంతో విద్యార్థులు కొంత ఒత్తిడికి గురవుతున్నప్పటికీ వారి భవిష్యత్తును ఆలోచించి వారికి అదనపు సమయం కేటాయించి చదివిస్తున్నామని మండలంలో పలు ఉపాధ్యాయులు చెబుతున్నారు.
చదువు మాత్రమే కాదు..
విద్యార్థులకు కేటాయించిన ప్రత్యేక తరగతుల్లో కేవలం వారికి చదువు చెప్పడం మాత్రమే కాదు, వారి ఆరోగ్యంపై దృష్టి ఉండడం కూడా చాలా ముఖ్యం. విద్యార్థుల్లో చాలామంది చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురైయ్యేవారు ఉన్నారు. అటువంటిది పూర్తి 8 నుంచి 9 గంటలు చదువుపైనే దృష్టి అంటే వారి ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. ఈ విషయంపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
విద్యార్థులకు పౌష్టిక ఆహారం, చిన్ని చిన్ని విరామాలు, జీవితంలో ముఖ్యమైన విషయాలు వంటివి చెప్పాలి. ఇలా అయితే, వారికి ప్రోత్సాహికంగా ఉంటుంది. అంతేకాకుండా, చదువుపై కూడా దృష్టి సారించగలరు. ప్రస్తుతం విద్యార్థుల మధ్యాహ్న భోజనంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో సుమారు 2018 వరకు విద్యార్థులకు అదనపు తరగతులకు జిల్లా పరిషత్ నుంచి అదనపు బడ్జెట్ కేటాయించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ప్రిపరేషన్‌కు ఏర్పాట్లు..
ఈనెల 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ప్రిపరేషన్ సమయంలో స్నాక్స్ అందించాలి, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
TS EdCET 2025 : టీజీ ఎడ్‌సెట్ 2025కు దరఖాస్తులు.. ఫీజు వివరాలివే..
పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత కోసం, ర్యాంకుల కోసం, ప్రత్యేక ప్రణాళికతో ఉపాధ్యాయులతో కలిసి పని చేస్తున్నాం. ప్రిపరేషన్ సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడి కలగకుండా ఉండేలా, యోగా తరగతులు, వ్యాయామాలు, చిన్న చిన్న బ్రేక్ సమయాలు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు అధికారులు. చదువులో ముందు ఉండేందుకు విద్యార్థులు ఆరోగ్యం పరంగా కూడా ముందే ఉండాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- tenth board exams 2025
- preparation tips for students
- best preparation planning for tenth board exams
- students health and education
- preparation tips for tenth students
- Telangana Government
- Education Department
- tg tenth board exams 2025 preparation planning in schools
- tenth board preparation at schools
- teachers suggestion for students
- school education department planning for board exams
- Education News
- Sakshi Education News