Telangana Revenue Department jobs: 10,954 రెవెన్యూ శాఖ ఉద్యోగాలకు లైన్ క్లియర్

సాక్షి, హైదరాబాద్: ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. స్థానిక సంస్థల్లో, విద్యారంగంలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే మరో ముసాయిదా బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశానంతరం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరాలు విలేకరులకు వెల్లడించారు.
తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ 2.5 శాతం DA ప్రకటించిన ప్రభుత్వం: Click Here
చిక్కులు తలెత్తకుండా ఎస్సీ వర్గీకరణ బిల్లు
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీల వర్గీకరణ చేపట్టడానికి ఏర్పాటు చేసిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ గత నెల 3న సమర్పించిన తొలి విడత సిఫారసులపై వివిధ వర్గాల నుంచి 71 విజ్ఞప్తులు వచ్చాయని పొంగులేటి తెలిపారు. ఈ విజ్ఞప్తులను పరిష్కరించిన అనంతరం తాజాగా కమిషన్ సమర్పించిన నివేదికను బిల్లు రూపంలో శాసనసభలో ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు.
ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా బిల్లును రూపొందించామన్నారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు కొత్త బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. 37 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు 2017లో సభలో ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు పొన్నం ప్రభాకర్ వివరించారు.
10,954 రెవెన్యూ శాఖ ఉద్యోగాలకు లైన్ క్లియర్
రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలన అధికారుల(జీపీఓ)ను నియమించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసింది. తాజాగా మళ్లీ వారిలో యోగ్యులను జీపీఓలుగా తీసుకోవాలని నిర్ణయించినట్టు పొంగులేటి వెల్లడించారు. శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలో కేంద్రం ఆధ్వర్యంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి 5.15 ఎకరాల కేటాయింపునకు మంత్రివర్గం అనుమతినిచ్చింది.
కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 361 పోస్టులను మంత్రివర్గం మంజూరుచేసింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ పరిధిలో 330 రెగ్యులర్, 165 అవుట్ సోర్సింగ్ పోస్టులు కలిపి మొత్తం 495 పోస్టులను ఆమోదించింది.
ఇక 3 సెక్టార్లుగా రాష్ట్రం!
‘రాష్ట్రాన్ని మూడు సెక్టార్లుగా విభజించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) లోపలి ప్రాంతాన్ని కోర్ అర్బన్ ఏరియాగా, అక్కడి నుంచి ట్రిపుల్ ఆర్ రోడ్డుకు ఆవల 2 కి.మీల బఫర్ జోన్ వరకు ఫ్యూచర్ సిటీగా, మిగిలిన ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా విభజించాలని నిర్ణయించాం.
రూరల్ తెలంగాణ పరిధిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు రావు. 7 మండలాల్లోని 56 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ ఏరియా (ఎఫ్‌సీడీఏ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. నాగార్జునసాగర్, శ్రీశైలం హైవేల మధ్య ఉన్న 30 కి.మీల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నాం. హెచ్‌ఎండీఏ పరిధిలోని 36 గ్రామాలను ఎఫ్‌సీడీఏకి బదిలీ చేశాం. ఫ్యూచర్ సిటీ కోసం 90 పోస్టులను ఆమోదించాం.
హెచ్‌ఎండీఏ పరిధి విస్తరణ
హెచ్‌ఎండీఏ పరిధిని రీజినల్ రింగ్ రోడ్డుకు 2 కి.మీల బఫర్ జోన్ వరకు పొడిగించాం. 11 జిల్లాల్లోని 104 మండలాలు, 1,355 గ్రామాలకు హెచ్‌ఎండీఏ పరిధి విస్తరించింది. కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు హెచ్‌ఎండీఏ పరిధిలోకి వస్తాయి..’ అని పొంగులేటి తెలిపారు.
సెర్ప్, మెప్మా విలీనం
‘కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద రూపొందించిన పాలసీ–2025ని కేబినెట్ ఆమోదించింది. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళల ఆర్థికాభివృద్ధికి అందించిన సహకారాన్ని మళ్లీ కొత్త పాలసీతో పునరుద్ధరిస్తాం.
మహిళా స్వయం సహాయక సంఘాలు ఒకే గొడుగు కింద ఉండాలనే ఉద్దేశంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లను ఒకే సంస్థగా విలీనం చేయాలని నిర్ణయించాం. ఇందిరా మహిళా శక్తి సంఘాల మహిళల రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 65 ఏళ్లకు పొడిగించడంతో పాటు సభ్యులుగా చేరేందుకు కనీస వయస్సును 18 నుంచి 15 ఏళ్లకు కుదించాం..’ అని మంత్రి చెప్పారు.
27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
‘తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987ను సవరించాలని నిర్ణయించాం. తెలంగాణ పర్యాటక పాలసీ–2025ని మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్ర వ్యాప్తంగా 27 ప్రత్యేక పర్యాటక కేంద్రాల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నాం. పర్యాటక విధానంతో వచ్చే 5 ఏళ్లలో రూ.15వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా నిర్ణయాలు తీసుకున్నాం..’ అని పొంగులేటి తెలిపారు.
మేలో హైదరాబాద్‌లో మిస్‌వరల్డ్ పోటీలు..
‘మేలో జరగనున్న మిస్ వరల్డ్– 2025 పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. 140 దేశాల నుంచి హాజరుకానున్న అతిథులకు ఎక్కడా లోటు జరకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాం..’ అని చెప్పారు.
దక్షిణాదికి అన్యాయంపై త్వరలో అఖిలపక్ష భేటీ
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయోజనం కల్పించడానికి కేంద్రం దురుద్దేశంతో వ్యవహరిస్తోందనే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్టు పొంగులేటి తెలిపారు.
Tags
- Telangana 10954 Revenue Department jobs
- TS Revenue Department Jobs Notification 10954 Posts
- Revenue Department jobs
- Jobs
- Telangana Jobs
- Telangana jobs Notification
- Latest Jobs News
- Telangana jobs Notificaion Line clear
- Good news for unemployed
- Telangana Revenue Department 10954 Jobs Recruitment 2025
- Telangana 10954 Revenue Department jobs Notificaion Line clear
- 10954 New Jobs in Telangana Revenue Department
- latest jobs
- trending jobs
- Telangana jobs calendar
- Telangana Jobs Calendar Jobs Notifications 2025
- TG Jobs
- TG Jobs calendar
- 10954 jobs in Telangana revenue department
- jobs in Telangana Revenue Department
- TS Govt Jobs In revenue department
- Telangana government recruitment
- Telangana government recruitment VRO jobs
- TS Revenue Department Jobs Notification 10954 Posts
- tg vro jobs
- tg vra jobs 2025
- tg job notifications 2025
- Latest TS Revenue Department jobs news in telugu
- Good news unemployed Telangana Revenue Department 10954 New Jobs
- Telangana 10954 jobs
- TS Revenue Dept Jobs 2025
- Trending jobs news in telugu
- Telangana revenue department jobs
- Telangana Panchayat Jobs
- BC Reservations 42% Telangana
- SC Classification Bill Telangana
- Telangana Cabinet Decisions