Skip to main content

8th Pay Commission Salary Hike 157 Percent: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌ గుడ్‌న్యూస్‌.. 157 శాతం జీతాల పెంపు!

8th Pay Commission Salary Hike   Central government employee salary revision
8th Pay Commission Salary Hike

ప్రభుత్వ ఉద్యోగులకు భారీ జాక్‌పాట్. కొత్త వేతన సంఘం ప్రకారం ఏ స్థాయిలో జీతాలు పెరుగుతాయనే అంశం లీకయ్యింది. జేసీఎమ్‌-ఎన్‌సీ వర్గాలు వెల్లడించిన ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని స్థాయిలో జీతాలు పెరుగుతాయని వెల్లడైంది.

ఉద్యోగులకు బోనస్, వేతన పెంపులపై సీఈవో క్లారిటీ: Click Here

ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా వేతన సంఘం ఏర్పాటులో కదలిక లేకపోయినా దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉద్యోగుల జీతాల పెరుగుదల ఏ స్థాయిలో ఉంటుందనే ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత మాత్రం పెరుగుతాయనే అంశం వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించి కీలక విషయాలు లీకయినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ బాడీ (జేసీఎం-ఎన్‌సీ) సమావేశంలో దీనికి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. 

ఈ జీతం పెంపులో ఫిట్‌మెంట్ అంశం కీలకమైన అంశం కానుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కనీసం 2.57 లేదా అంతకంటే ఎక్కువకు పెంచాలని నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ బాడీ (జేసీఎం-ఎన్‌సీ) అభ్యర్థించింది. 

8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ శాతం:
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాన్ని నిర్ణయించడానికి ఉపయోగించే గణన పద్ధతి. 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57గా నిర్ణయిస్తే ప్రభుత్వ ఉద్యోగుల జీతం దాదాపు 157 శాతం పెరుగుతుంది. అంటే కనీస నెలవారీ వేతనం రూ.18,000 నుంచి రూ.46,260కి పెరుగుతుంది. 

ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ 2.57గా నిర్ణయిస్తే పింఛన్‌దారులకు కూడా భారీగా ప్రయోజనం లభిస్తుంది. కనీస పింఛన్ నెలకు రూ.9 వేలు అవుతుంది. ఇది రూ.23,130 నుంచి రూ.23,130కి పెరిగే అవకాశం ఉంది.

8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ కారకం 2.57 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలని జేసీఎం-ఎన్‌సీ కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా పేర్కొన్నారు. పాత ప్రమాణాలు ఇప్పుడు వర్తించవు అని చెప్పారు.
 

Published date : 06 Mar 2025 08:23AM

Photo Stories