Skip to main content

Telangana State Cooperative Banks jobs: తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్‌ బ్యాంకుల్లో ఉద్యోగాలు నెలకు జీతం 25,000

Telangana State Cooperative Banks jobs  Telangana State Cooperative Apex Bank Limited recruitment announcement  TGCAB job notification with 10 vacancies Telangana Cooperative Bank job opportunities
Telangana State Cooperative Banks jobs

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్ (TGCAB).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఇంటర్న్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా 10 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో 9 ఖాళీలు డిస్ట్రిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ (DCCB)ల్లో ఉన్నాయి.

10వ తరగతి, Inter పరీక్షల షెడ్యూల్‌ విడుదల: Click Here

మొత్తం ఖాళీల సంఖ్య: 10
తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్‌ బ్యాంక్‌ (TGCAB): 01
డిస్ట్రిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ (DCCB): 09

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ (మార్కెటింగ్/ కోఆపరేటివ్/ అగ్రి బిజినెస్/ రూరల్ డెవలప్‌మెంట్), పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.25,000 వరకు వేతనం ఉంటుంది.

పని ప్రదేశాలు: ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్‌, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, షార్ట్‌లిస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ది డిప్యూటీ జనరల్ మేనేజర్, హ్యుమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్, ది తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ట్రూప్ బజార్, హైదరాబాద్’ చిరునామాకు పంపించాలి. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://tscab.org/ చూడొచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్‌ 30, 2024

Published date : 22 Nov 2024 08:41AM
PDF

Photo Stories