Skip to main content

FLN Training for Teachers : ఎఫ్‌ఎల్‌ఎన్ రెసిడెన్షియల్‌ శిక్ష‌ణ‌పై ఉపాధ్యాయ సంఘాలు మండిపాటు.. కార‌ణం!

తమకు స్థానికంగా శిక్షణ ఇవ్వాలని చెప్పినా విద్యాశాఖ పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Teachers' Unions protest over FLN residential training  Teachers demand local training after incidents in Agiripalli and chirala

అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచేందుకు ఉపాధ్యాయులకు ఇస్తు­న్న ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) రెసిడెన్షియల్‌ శిక్షణపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. తమకు స్థానికంగా శిక్షణ ఇవ్వాలని చెప్పినా విద్యాశాఖ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బుధవారం ఆగిరిపల్లిలో శిక్షణ కోసం వచ్చిన ఉపా­ధ్యాయుడు మృతి చెందడం, చీరాలలో మరో ఉపాధ్యాయుడు అస్వస్తతకు గురవడంతో ఈ శిక్షణ­ను పూర్తిగా బహిష్కరించాలని భావిస్తున్నా­యి.

Apprentice Mela: ఐటీఐ విద్యార్థుల కోసం.. ఈనెల 11న అప్రెంటిస్‌ మేళా

ఉపాధ్యాయులపై ఉన్న భారాన్ని తొలగి­స్తా­మని, యాప్స్, శిక్షణ అంశాలను తొలగిస్తామని ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు హామీ­లు ఇచ్చారని, కానీ గతం కంటే ఇప్పుడు పని ఒత్తి­డి అధికంగా పెంచారని ఉపాధ్యాయులు చెబుతు­న్నారు. ప్రపంచ బ్యాంకు నిబంధనలను తమపై బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపి­స్తున్నారు. 50 ఏళ్ల వయసు పైబడిన వారికి శిక్షణ నుంచి మినహాయించాలన్నా విద్యాశాఖ పట్టించుకోవడం లేదని, దీనిపై ఒకటి రెండు రోజుల్లో పాఠశాల విద్య డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేసి తమకు అనుకూలంగా నిర్ణయం రాకుంటే శిక్షణను బహిష్కరిస్తామని ఉపాధ్యాయ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

విద్యా ప్రమాణాల పెంపునకు శిక్షణ
విద్యాబోధనలో ప్రమాణాలు పెంచాలంటే ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఉండాలని జాతీయ విద్యా విధానానికి, నిపుణ్‌ భారత్‌ ప్రోగ్రామ్‌కు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణను ప్రారంభించింది. ఈ శిక్షణ ద్వారా 1, 2 తరగతులపై దృష్టి సారించి, 3 నుంచి 8 సంవత్సరాల వయసు పిల్లలకు నాణ్యమైన విద్యను అందచడమే లక్ష్యంగా కోర్సుకు రూపకల్పన చేశారు. మొత్తం 34 వేల మంది గ్రేడ్‌–1, 2 కేటగిరీ ఉపాధ్యాయులకు 14 విడతల్లో ఈ శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. గతేడాది కూడా ఇదే తరహా శిక్షణను రాష్ట్ర వ్యాప్తంగా 9 కేంద్రాల్లో దాదాపు 4 వేల మందికి, ఈ ఏడాది తొలివిడత 1,700 మందికి శిక్షణ ఇచ్చారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

అయి­తే, అప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. గతేడాది పిల్లలను బడిలో చేర్పించడం, బడి బయటి పిల్లలను సర్వే చేయడం, వారిని బడికి తీసుకొచ్చే బాధ్యతను వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది తీసుకున్నారు. అయితే, ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల చేరికల కోసం ఇంటింటి సర్వే ఉపాధ్యాయులే చేయాల్సి వచ్చింది. దీంతోపాటు పదో తరగతి విద్యార్థుల నామినల్‌ రోల్స్‌ సిద్ధం చేయడం, కొత్తగా అపార్‌ ఐడీల నమోదు వంటి అదనపు భారం తమపై పడిందని, దీంతో తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

APPSC Departmental Tests: డిపార్ట్‌మెంటల్ టెస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుద‌ల‌

Published date : 08 Nov 2024 11:55AM

Photo Stories