Apprentice Mela: ఐటీఐ విద్యార్థుల కోసం.. ఈనెల 11న అప్రెంటిస్ మేళా
Sakshi Education
కర్నూలు సిటీ: ఐటీఐ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి ఈ నెల 11వ తేదీన అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ బాలికల ఐటీఐ కాలేజీల కన్వీనర్ ప్రిన్సిపాల్ ఆర్.కృష్ణమోహన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
భారత ప్రభుత్వ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఉపాధి కల్పన, శిక్షణ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఐటీఐ కాలేజీల్లో చదివిన నిరుద్యోగ యువతీ, యువకులకు అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Technical Certificate Course: టీటీసీ కోర్సులకు పరీక్షలు.. ఫీజు వివరాలివే
ఈ మేళాకు జిల్లాలోని వివిధ పారిశ్రామికవేత్తలు హాజరై అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని తెలిపారు. ఆన్‌లైన్‌లో అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ https://a pprenticeshipindia.gov.in నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఒరిజినల్ ధ్రువపత్రాలతో బి.తాండ్రపాడులోని ప్రభుత్వ బాలికల ఐటీఐ కాలేజీలో జరిగే మేళాకు హాజరుకావాలని సూచించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 08 Nov 2024 11:26AM
Tags
- Apprentice Mela
- Apprentice Mela at ITI
- ITI students
- Apprentice Mela for ITI Students
- ITI
- ITI Courses
- ITI Courses after 10th
- Kurnool
- apprentice mela in Kurnool
- Selection Process
- Eligible Candidates
- KurnoolCityApprenticeFair
- ITIGraduates
- GovernmentGirlsITICollege
- ApprenticeshipOpportunity
- ITIJobFair
- ApprenticeshipEventKurnool
- RKrishnamohan