Skip to main content

Certificates Verification: అప్రెంటిస్‌ మేళాకు దరఖాస్తు చేసుకున్నారా? ఈ సర్టిఫికేట్స్‌ తప్పనిసరి!

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : ఏపీఎస్‌ ఆర్టీసీలో అప్రెంటీస్‌ కోసం గత నెల 5 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న జిల్లా ఐటీఐ అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కోసం ఈ నెల 10న కర్నూలులోని జోనల్‌ ట్రైనింగ్‌ కాలేజీలో తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని కడప ఆర్టీసీ ఆర్‌ఎం పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు.
Certificates Verification   Kadapa RTC office notice on APSRTC apprenticeship certificate verification  Certificate verification details for ITI candidates in Kurnool  APSRTC apprenticeship certificate verification schedule at Zonal Training College
Certificates Verification

10వ తరగతి, ఐటీఐ, ఎన్‌సీవీటీ సర్టిఫికెట్లు, ఎస్సీఎస్టీబీసీ అభ్యర్థులు కుల ధ్రువీకరణపత్రం, వికలాంగులయితే అందుకు సంబంధించిన ధ్రువీకరణపత్రం, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాంకు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో, ఒక సెట్‌ జిరాక్స్‌ కాపీలతో వెరిఫికేషన్‌ ఫీజు కోసం రూ.118 తీసుకుని హాజరు కావాలన్నారు.

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. జాబ్‌మేళా,నెలకు రూ.20వేలకు పైనే..

డీజిల్‌ మెకానిక్‌ ట్రేడ్‌ వారికి ఆ రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు, మోటారు మెకానిక్‌, ఎలక్ట్రిషియన్‌, వెల్డర్‌, పెయింటర్‌, మెషనిస్టు, ఫిట్టర్‌, డ్రాఫ్ట్‌మెన్‌ అభ్యర్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుందని పేర్కొన్నారు.

Apprentice Mela At ITI College  Apprentice fair at Government ITI College, Mogalrajapuram Apprenticeship opportunity for ITI graduates in Mogalrajapuram, Vijayawada Announcement of apprentice fair at Government ITI College

KGBV Jobs 2024: కేజీబీవీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే హాజరు కావాలన్నారు. ఏదైనా సమాచారం కోసం 08518–57025 నంబరులో కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలని వివరించారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 07 Dec 2024 03:09PM

Photo Stories