ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సులైన డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ, వీవింగ్ లోయర్, హయ్యర్ పరీక్షలు వచ్చే 2025 జనవరిలో జరుగుతాయని, ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష ఫీజులు చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు.
Technical Certificate Course
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని పరీక్ష ఫీజులు అదే వెబ్‌సైట్‌లో పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించాలని సూచించారు. వెబ్ దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని వాటిని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమర్పించవచ్చన్నారు.