Skip to main content

Telangana DEECET 2025 : తెలంగాణ డీఈఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదల, నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

Telangana DEECET 2025 : తెలంగాణ డీఈఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదల, నేటి  నుంచి దరఖాస్తులు ప్రారంభం
Telangana DEECET 2025 : తెలంగాణ డీఈఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదల, నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

తెలంగాణ డీఈఈసెట్-2025 నోటిఫికేషన్ ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రెండేళ్ల డీఈడీ కోర్సు్లో ప్రవేశానికి డీఈఈసెట్ నిర్వహిస్తారు. నేటి నుండి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.టీజీ డీఈఈసెట్ 2025 అర్హత సాధించడానికి అభ్యర్థులు కనీసం 50% మార్కులతో (SC/ST/PH అభ్యర్థులకు 45%) ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.ఇంటర్ పాసైన విద్యార్థులు మే 15 వరకు అప్లై చేసుకోవచ్చు. అదే నెల 25న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. టీజీ డీఈఈసెట్ కు కనీస వయస్సు సెప్టెంబర్ 1, 2025 నాటికి 17 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి లేదు. ఈ విద్యా అర్హత, వయస్సు ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు తెలంగాణలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను అభ్యసించడానికి డీఈఈసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇదీ చదవండి:  CUET UG 2025: నేడే కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్‌(సీయూఈటీ-2025) రిజిస్ట్రేషన్ చివరి తేదీ

ముఖ్యమైన తేదీలు

  • టీజీ డీఈఈసెట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం - మార్చి 24, 2025
  • టీజీ డీఈఈసెట్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ -మే 15, 2025
  • టీజీ డీఈఈసెట్ పరీక్ష తేదీ -మే25, ​​2025

☛ Follow our YouTube Channel (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Published date : 24 Mar 2025 12:57PM
PDF

Photo Stories