UGC NET December 2023 Notification : యూజీసీ నెట్-2023 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చివరి తేదీ ఇదే.. ఇంకా..
ఈ పరీక్షను జాతీయ పరీక్షల సంస్థ (NTA) నిర్వహిస్తుంది. ఇప్పటికే యూజీసీ నెట్ 2023 దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం అయింది. మొత్తం 83 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 28 సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష రుసుమును అక్టోబర్ 29 రాత్రి 11.50 గంటల వరకు చెల్లించవచ్చని NTA తెలిపింది. దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే అక్టోబర్ 30 నుంచి 31న రాత్రి 11.50 గంటల వరకు సరిచేసుకోవచ్చు.పరీక్ష కేంద్రాల వివరాలను నవంబర్ చివరి వారంలో ప్రకటించనున్న ఎన్‌టీఏ.. డిసెంబర్ మొదటి వారంలో అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది.
ఫీజుల వివరాలు ఇలా..
దరఖాస్తు రుసుం జనరల్/అన్‌రిజర్వుడు రూ.1150, జనరల్ (ఈడబ్ల్యూఎస్/ఓబీసీ-ఎన్‌సీఎల్) అభ్యర్థులు రూ.600, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్ జెండర్ అభ్యర్థులైతే రూ.325ల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఎన్‌టీఏ పేర్కొంది.
అర్హతలు ఇవే..
55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. JRF కు 01.12.2023 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్కు గరిష్ఠ వయోపరిమితి లేదు.
సబ్జెక్టులు ఇవే.. :
అడల్ట్ ఎడ్యుకేషన్, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్, క్రిమినాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, ఇంగ్లిష్, హోం సైన్స్, హిస్టరీ, ఫోరెన్సిక్ సైన్స్, ఇండియన్ కల్చర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, లింగ్విస్టిక్స్, మ్యూజిక్, సైకాలజీ, లా, మొదలైన సబ్జెక్టులు..
యూజీసీ నెట్-2023 పరీక్షావిధానం ఇదే..
ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది.
పేపర్-1 :
పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్‌జెంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
పేపర్-2 :
పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.
తెలంగాణలో పరీక్ష కేంద్రాలు ఇవే..:
హైదరాబాద్, సికింద్రాబాద్, హయత్‌నగర్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్.
ఏపీలో పరీక్ష కేంద్రాలు ఇవే..:
అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, తిరుపతి, ఏలూరు, గూడురు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తూర్పుగోదావి-సూరంపాలెం, పశ్చిమగోదావరి-తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
యూజీసీ నెట్ 2023 ముఖ్యమైన తేదీలు ఇవే..
☛ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 30.09.2023.
☛ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 28.10.2023 (11.50 PM)
☛ ఫీజు చెల్లించడానికి చివరితేది: 29.10.2023 (11.50 PM)
☛ దరఖాస్తుల సవరణకు అవకాశం: 30-31.10.2023 (11.50 PM)
☛ ఎగ్జామ్ సిటీ వివరాల వెల్లడి: నవంబరు చివరి వారంలో.
☛ అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్: డిసెంబరు మొదటి వారంలో.
☛ యూజీసీ నెట్-డిసెంబరు 2023 పరీక్షలు: 06.12.2023 - 22.12.2023.
బెస్ట్ స్కోర్‌కు మార్గాలివే..
జాతీయ స్థాయిలో నిర్వహించే యూజీసీ నెట్‌లో విజయం సాధించాలంటే..అభ్యర్థులు సబ్జెక్ట్‌పై సంపూర్ణ అవగాహన పెంచుకోవడం చాలా అవసరం.
పేపర్-1 ఉమ్మడిగా..
అభ్యర్థులందరికీ ఉమ్మడి పరీక్ష..పేపర్-1. ఇందులో టీచింగ్, రీసెర్చ్ ఆసక్తులను పరిశీలించే విధంగా ప్రశ్నలుంటాయి. మొత్తం పది విభాగాల(టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ అండ్ ఎన్విరాన్‌మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్-గవర్నెన్స్, పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్) నుంచి.. ఒక్కో విభాగంలో అయిదు ప్రశ్నలు అడుగుతారు.
పేపర్-2.. సబ్జెక్ట్ సంబంధిత ప్రశ్నలు..
పేపర్-2లో అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్ నుంచే ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ప్రశ్నలు పీజీ స్పెషలైజేషన్ సిలబస్ స్థాయిలో ఉంటాయి. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించి ఇంటర్మీడియెట్ నుంచి పీజీ వరకు అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
ప్రాక్టికల్ అప్రోచ్..
అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో ఆయా అంశాలను చదివేటప్పుడు అప్లికేషన్ ఓరియెంటేషన్, ప్రాక్టికల్ అప్రోచ్‌ను అనుసరించాలి. కారణం..పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు ప్రాక్టికల్ థింకింగ్, అప్లికేషన్ ఓరియెంటేషన్‌లు ఎంతో అవసరమవుతున్నాయి. క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ అప్రోచ్ మెరుగుపరచుకుంటే.. ప్రశ్నలు ఏ విధంగా అడిగినా సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.
యూజీసీ నెట్‌తో ప్రయోజనాలివే..
- యూజీసీ నెట్‌లో ఉత్తీర్ణత సాధించి తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు పలు అవకాశాలు లభిస్తున్నాయి.
- అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాతో అధ్యాపక వృత్తిలో అడుగు పెట్టొచ్చు. యూజీసీ నిబంధనల ప్రకారం-నెట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో అర్హత సాధించిన వారినే ఈ పోస్ట్‌లకు ఎంపిక చేయాలి.
- జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే.. ప్రముఖ రీసెర్చ్ లేబొరేటరీల్లో మూడేళ్లపాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేయొచ్చు. తొలిæరెండేళ్లు జేఆర్‌ఎఫ్ హోదాలో నెలకు రూ.31 వేల ఫెలోషిప్ పొందొచ్చు.
- జేఆర్‌ఎఫ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఎస్‌ఆర్‌ఎఫ్‌కు అర్హత లభిస్తుంది. ఈ దశలో రెండేళ్లపాటు నెలకు రూ.35 వేల స్కాలర్‌షిప్ అందుతుంది.
- ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో పీహెచ్‌డీ, రీసెర్చ్ అభ్యర్థుల ఎంపికలో నెట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఉంటుంది.
- జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు పూర్తి చేసుకున్న వారికి సైంటిస్ట్‌లుగా ప్రభుత్వ విభాగాల్లో కెరీర్ ప్రారంభించే అవకాశం లభిస్తుంది.
- ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్‌ల్లో జేఆర్‌ఎఫ్‌కు ఎంపికై పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పురావస్తు శాఖ, ఆర్థిక గణాంక శాఖలు, సామాజిక, న్యాయ మంత్రిత్వ శాఖ వంటి పలు ప్రభుత్వ విభాగాల్లో రీసెర్చ్ స్కాలర్స్‌గా అవకాశాలు దక్కుతాయి.
Tags
- ugc net 2023 december notification
- ugc net 2023 december exam pattern and syllabus
- ugc net exam 2023 december application
- UGC NET Benefits in Telugu
- ugc net subject wise eligibility
- ugc net subject wise eligibility in telugu
- ugc net age limit
- ugc net age limit for assistant professor
- jrf age limit for female 2023
- jrf age limit for male 2023
- ugc net december 2023 eligibility criteria in telugu
- ugc net december 2023 exam pattern
- ugc net december 2023 exam pattern and eligibility criteria
- sakshi education latest admissions
- Latest Admissions.