Admissions: పద్మావతి మహిళా వర్సిటీలో వివిధ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (సంగీతం), మాస్టర్ ఆఫ్ కామర్స్, డిప్లొమా ఇన్ మ్యూజిక్ (సంకీర్తన, వర్ణం, అన్నమయ్య అంతరంగం)లో ప్రవేశానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తు ఫారం, అర్హత, ఫీజు వివరాలు వంటి సమాచారం వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఈనెల 31వ తేదీలోపు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నవంబర్ 15వ తేదీన స్పాట్ అడ్మిషన్ల చేపట్టనున్నట్లు వెల్లడించారు. వివరాలకు .0877–2284524, 8121787415 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)
Published date : 22 Oct 2024 03:05PM