ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో లాసెట్ – 2024 తుది విడత కౌన్సెలింగ్ తరువాత మిగులు సీట్లకు ఈ నెల 20న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ పి.సుజాత బుధవారం తెలిపారు. డిగ్రీలో ఓసీ– 45 శాతం, బీసీ–42 శాతం, ఎస్టీ, ఎస్సీ– 40 శాతం మార్కులు కలిగి ఉండి లాసెట్ –2024 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు.
Spot Admissions
లాసెట్ ర్యాంకు కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, టీసీలతో హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఫీజు స్ట్రక్చర్ రూ.10345, పరీక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. స్పాట్ అడ్మిషన్లకు ఎటువంటి ప్రభుత్వ రాయితీలు వర్తించబోవని స్పష్టం చేశారు.
మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో 60 సీట్లకు గాను 12 సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఇందులో రెండు ఈడబ్ల్యూఎస్ సీట్లు ఉన్నట్లు వివరించారు. విద్యార్థుల ఎక్కువగా హాజరైతే ర్యాంకు మెరిట్, రిజర్వేషన్ రోస్టర్ పరిశీలించి ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు.