Para Medical Technology : వైద్య రంగంలో కీలకంగా పారా మెడికల్ టెక్నాలజీ.. ఏపీలో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల..
ఈ కోర్సులు పూర్తి చేసుకుంటే విస్తృత కెరీర్ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు! తాజాగా.. బీఎస్సీ పారా మెడికల్ టెక్నాలజీ ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య విశ్వ విద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. బీఎస్సీ పారా మెడికల్ టెక్నాలజీ కోర్సులు, ప్రత్యేకతలు, ప్రవేశ విధానం, కెరీర్ అవకాశాల వివరాలు..
పారా మెడికల్ టెక్నాలజీ.. వైద్య రంగంలో పలు విభాగాలకు సంబంధించి నైపుణ్యాలను అందించే కోర్సు. బీఎస్సీ స్థాయిలో పలు స్పెషలైజేషన్లతో ఉన్న ఈ కోర్సులను పూర్తి చేసుకుంటే.. ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగంలో కెరీర్ కోరుకునే వారికి ఎంతో కీలకమైన కోర్సుగా పారా మెడికల్ టెక్నాలజీ నిలుస్తోంది.
JEE Advanced 2025: మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్..
అర్హతలు
➾ బీఎస్సీ పారా మెడికల్ టెక్నాలజీ కోర్సులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వైద్య విశ్వ విద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. బైపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అదే విధంగా.. ఇంటర్మీడియెట్ ఒకేషనల్ (ఎంఎల్‌టీ) పూర్తి చేసుకుని.. బయాలజీ, ఫిజికల్ సైన్సెస్‌లో బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
➾ వయసు: 2024, డిసెంబర్ 31 నాటికి కనీసం 17 ఏళ్లు పూర్తి చేసుకోవాలి.
15 స్పెషలైజేషన్లు
ఏపీలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం–ప్రస్తుతం బీఎస్సీ పారా మెడికల్ టెక్నాలజీలో 15 స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అవి.. బీఎస్సీ–మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ; బీఎస్సీ–న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ;బీఎస్సీ–ఆప్టోమెట్రిక్ టెక్నా లజీ; బీఎస్సీ–రెనల్‌డయాలసిస్ టెక్నాలజీ; బీఎస్సీ–పెర్‌ఫ్యూషన్ టెక్నాలజీ;బీఎస్సీ–కార్డియాక్ కేర్ అండ్ కార్డియో వ్యాస్క్యులర్ టెక్నాలజీ; బీఎస్సీ–ఇమేజింగ్ టెక్నాలజీ; బీఎస్సీ–ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ; బీఎస్సీ–రెస్పిరేషన్ థెరపీ టెక్నాలజీ; బీఎస్సీ–ఫిజిషియన్ అసిస్టెంట్ టెక్నాలజీ; బీఎస్సీ–మెడికల్ రికార్డ్స్ అసిస్టెంట్ టెక్నాలజీ; బీఎస్సీ–ట్రాన్‌ఫ్యూజన్ టెక్నాలజీ; బీఎస్సీ–రేడియో థెరపీ టెక్నాలజీ; బీఎస్సీ–ఎకో కార్డియోగ్రఫీ టెక్నాలజీ.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
మెరిట్ ఆధారంగా ఎంపిక
బీఎస్సీ పారా మెడికల్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్మీడియెట్ (బైపీసీ) మార్కులను ప్రాతిపదికగా తీసుకుంటారు. ముందుగా అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మార్కుల ఆధారంగా ప్రొవిజినల్ మెరిట్ జాబితా, అనంతరం ఫైనల్ మెరిట్ జాబితా విడుదల చేస్తారు. విద్యార్థులు వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌ల ప్రాధాన్యతలను పేర్కొనాల్సి ఉంటుంది.
కెరీర్ అవకాశాలు
➾ పారామెడికల్ నిపుణులు రోగి చికిత్సకు అవసరమైన నివేదికలు అందిస్తారు. అదే విధంగా చికిత్సలో వైద్యులకు సహకరించేలా విధులు నిర్వహిస్తారు. ఈ నైపుణ్యాలు పారా మెడికల్ టెక్నాలజీ కోర్సుల ద్వారా లభిస్తాయి.
➾ బీఎస్సీ స్థాయిలో పారా మెడికల్ టెక్నాలజీ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి అవకాశాలు విస్తృతం అవుతున్నాయి. వీరికి ప్రధానంగా హాస్పిటల్స్, లేబొరేటరీస్, డయాగ్నస్టిక్ సెంటర్స్ ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి.
NTPC Recruitments : ఎన్‌టీపీసీలో 50 అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు
ముఖ్య సమాచారం
➾ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
➾ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, డిసెంబర్ 9
➾ పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://drntr.uhsap.in
స్పెషలైజేషన్ల వారీగా
బీఎస్సీ పారా మెడికల్ టెక్నాలజీలోని ఆయా స్పెషలైజేషన్ల వారీగా కోర్సుల ప్రత్యేకతల వివరాలు..
మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ
వ్యాధి నిర్ధారణకు మెడికల్ లేబొరేటరీల్లో పరీక్షలు నిర్వహించి.. వైద్యులకు నివేదికలు అందించాల్సి ఉంటంది. ఈ ఎంఎల్‌టీ కోర్సు పూర్తి చేసిన వారు తమ నైపుణ్యంతో నివేదికలు రూపొందిస్తారు. వీరికి ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్ లేబొరేటరీల్లో, ప్రైవేటు మెడికల్ లేబొరేటరీల్లో అవకాశాలు లభిస్తాయి. ప్రారంభంలో నెలకు రూ.25 వేల వరకు వేతనం లభిస్తుంది.
న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ
బీఎస్సీ పారా మెడికల్ టెక్నాలజీలో మరో ప్రత్యేకమైన కోర్సు.. న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ. మెదడు నాడీ వ్యవస్థకు సంబంధించిన అంశాలు, సమస్యలు, వాటికి పరిష్కారంపై ఈ కోర్సు ద్వారా అవగాహన లభిస్తుంది. అదే విధంగా శరీరంలోని ఇతర నాడీ వ్యవస్థల పని తీరుకు సంబంధించిన అంశాలపైనా నైపుణ్యం సొంతం చేసుకోవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారికి న్యూరోపాథాలజిస్ట్, న్యూరో కన్సల్టెంట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.
ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ
ఇటీవల కాలంలో ఉపాధి అవకాశాల పరంగా వేగంగా వృద్ధి చెందుతున్న విభాగం.. ఆప్టోమెట్రీ. కంటి సమస్యలకు సంబంధించి జాగ్రత్తలు, వ్యాధులు, వాటిని గుర్తించే పద్ధతులను ఈ కోర్సు ద్వారా తెలుసుకోవచ్చు. కంటి ఆసుపత్రుల్లో నేత్ర వైద్యులకు అనుబంధంగా సేవలు అందించటంలో ఆప్టోమెట్రీషియన్ల పాత్ర కీలకంగా మారుతోంది.
రెనల్ డయాలసిస్ టెక్నాలజీ
కిడ్నీ సమస్యలకు సంబంధించిన పరిష్కారాలను కనుగొనే నైపుణ్యాలను ఈ కోర్సు ద్వారా సొంతం చేసుకోవచ్చు. డయాలసిస్ చేసే సమయంలో ఉపయోగించే పరికరాల నాణ్యత, నిర్వహణ వంటి నైపుణ్యాలు లభిస్తాయి.
Engineer Posts : బీఈఎల్‌ఓపీలో ఒప్పంద ప్రాతిపదికన ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
పెర్‌ఫ్యూషన్ టెక్నాలజీ
గుండెకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసేందుకు పర్‌ఫ్యూషన్ టెక్నాలజీ కీలకంగా మారుతోంది. ముఖ్యంగా శస్త్రచికిత్సల సమయంలో ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లకు సహకరించడం, సంబంధిత పరికరాలను నిర్వహించడం, కృత్రిమ పరికరాలు (ఉదాహరణకు హార్ట్–లంగ్ మిషిన్, డిఫిబ్రిలేటర్, వైబ్రేటర్ తదితర) ఎంపిక, అమరికలో పర్‌ఫ్యూషన్ టెక్నాలజీ నిపుణుల సేవలు కీలకంగా నిలుస్తున్నాయి. ఈ కోర్సును పూర్తి చేసుకుంటే..ఎక్విప్‌మెంట్ తయారీ సంస్థలు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో కొలువులు సొంతం చేసుకోవచ్చు.
అనస్తీషియాలజీ టెక్నాలజీ
అండ్ ఆపరేషన్ టెక్నాలజీ
శస్త్ర చికిత్స సమయంలో సదరు రోగికి ఆ బాధ తెలియకుండా ఉండేందుకు వైద్యులు అనుసరిస్తున్న విధానం.. అనస్తీషియా. దీంతో అనస్థీషియా టెక్నాలజీ ఎంతో కీలకంగా నిలుస్తోంది. రోగులకు మత్తు ఇవ్వడం, ఇవ్వాల్సిన స్థాయి, శరీరంలో ఏ భాగంలో ఇవ్వాలి వంటి నైపుణ్యాలు అందించే కోర్సుగా అనస్తీషియా టెక్నాలజీ నిలుస్తోంది.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
కార్డియాక్ కేర్ టెక్నాలజీ, కార్డియో వాస్క్యులర్ టెక్నాలజీ
గుండె పనితీరుకు సంబంధించి నైపుణ్యాలను అందించే కోర్సు.. కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియో వాస్క్యులర్ టెక్నాలజీ. గుండె ఆపరేషన్ల పరంగా అవసరమైన బెలూన్ యాంజియోప్లాస్టీ, అనస్థీషియా, ప్రెప్పింగ్ వంటి విధానాల్లోనూ అవగాహన పొందుతారు. అదే విధంగా కార్డియో వ్యాస్కులర్ వ్యాధులకు సంబంధించి చికిత్స సమయంలో వైద్యులకు అవసరమయ్యే పరికరాల నిర్వహణ,యాంజియోప్లాస్టీ, కార్డియాక్ క్యాథరైజేషన్,ఎల క్ట్రో ఫిజియాలజీ వంటి ప్రక్రియల్లో పాల్గొంటారు.
మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ
ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే, సీటీ స్కాన్, అల్ట్రా సౌండ్ స్కానింగ్‌కు సంబంధించిన నైపుణ్యాలు అందించే కోర్సు.. ఇమేజింగ్ టెక్నాలజీ. ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే, సీటీ స్కాన్ తదితర పరీక్షల సమయంలో రేడియాలజిస్ట్‌ల సూచనలకు అనుగుణంగా సాంకేతిక పరికరాలను వినియోగించడం వంటి నైపుణ్యాలను మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ కోర్సు ద్వారా సొంతం చేసుకోవచ్చు.
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ
అత్యవసర పరిస్థితుల్లో లైఫ్ సపోర్ట్ అందించడం, క్రిటికల్ కేర్ సపోర్ట్, వెంటిలేషన్, కార్డియాక్ అరెస్ట్స్, క్రిటికల్ మెడికల్ కేస్‌లను పరిష్కరించడం వంటి నైపుణ్యాలను అందించే కోర్సు ఇది. వీరికి నెఫ్రాలజిస్ట్ కన్సల్టెంట్, క్యాథ్ ల్యాబ్ టెక్నిషియన్, క్లినికల్ ఇన్వెస్టిగేటర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.
Job Recruitments : బామర్ లారీ–కో లిమిటెడ్‌లో వివిధ ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు..
రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ
ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించే కోర్సు రెస్పిరేటరీ థెరపీ. ‘బ్రోంకేస్కోపి’టెస్ట్ చేయడంలో రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ నైపుణ్యాలు ఎంతో కీలకంగా నిలుస్తాయి.
ఫిజిషియన్ అసిస్టెంట్ టెక్నాలజీ
ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారికి అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, ప్యాథాలజీ, ఫార్మకాలజీ వంటి అంశాలపై నైపుణ్యం లభిస్తుంది. అదే విధంగా జనరల్ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్, కార్డియాలజీ వంటి విభాగాల్లో నైపుణ్యం లభిస్తుంది.
మెడికల్ రికార్డ్స్ అసిస్టెంట్ టెక్నాలజీ
రోగుల హెల్త్‌కేర్ డేటాను నిర్వహించే నైపుణ్యాలను అందించే కోర్సు ఇది. మెడికల్ రికార్డ్స్ కలెక్షన్, అనలైజేషన్ వంటి ప్రక్రియలు ఉంటాయి. మెడికల్ కోడింగ్, హెల్త్‌కేర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ వంటి నైపుణ్యాలు కూడా లభిస్తాయి.
ట్రాన్స్‌ఫ్యూజన్ టెక్నాలజీ
ఈ కోర్సు ప్రధానంగా.. రక్త సేకరణ నైపుణ్యాలు అందించేలా ఉంటుంది. బ్లడ్ స్టోరేజ్, బ్లడ్ టెస్టింగ్, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ప్రక్రియలలో నైపుణ్యాలు లభిస్తాయి. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారికి బ్లడ్ బ్యాంక్ టెక్నిషియన్స్, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ స్పెషలిస్ట్స్, క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.
రేడియో థెరపీ టెక్నాలజీ
కేన్సర్ వంటి వాటికి రేడియేషన్‌ను ఏ స్థాయిలో ఇవ్వాలి అనే దానితోపాటు డయాగ్నస్టిక్ టెస్ట్స్(ఎక్స్‌రే, సీటీ స్కాన్ తదితర)పై అవగాహన కల్పించే కోర్సు ఇది.
TSPSC Group-4 Update News : ఎల్లుండి గ్రూప్-4 అభ్యర్థులకు...
ఎకో కార్డియోగ్రఫీ టెక్నాలజీ
గుండె పనితీరుకు సంబంధించి ప్రాథమికంగా అవగాహన కల్పించే కోర్సు.. ఎకో కార్డియో గ్రఫీ టెక్నాలజీ. హార్ట్ బీట్, హార్ట్ ఇంపల్సెస్‌కు సంబంధించిన నైపుణ్యాలను, సాంకేతిక పరికరాలను సమర్థంగా వినియోగించే నైపుణ్యాలను అందించే కోర్సు ఇది.
Tags
- Para Medical Courses
- Admissions 2024
- Medical courses
- exam preparations for para medical course
- ap notification for para medical technology
- medical field
- UG admissions
- Career Opportunities
- bsc para medical technology admission
- AP Medical University
- specializations in para medical technology
- career and job opportunities with para medical technology
- online applications for medical courses
- para medical technology course specializations
- Education News
- Sakshi Education News
- BScParaMedicalTechnology
- ParaMedicalCourses
- BScAdmissions
- eligibiecriteria
- Career
- Latest admissions
- sakshieducationlatestadmissions