National Achievement Survey 2024 News: మన విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యమెంత? .... ఈ నెల 4వ తేదీన దేశవ్యాప్తంగా నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే
హైదరాబాద్: పాఠశాల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈ నెల 4వ తేదీన దేశవ్యాప్తంగా నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (న్యాస్) జరగనుంది. దీనికో సం రాష్ట్రంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆయా స్కూళ్ళను సందర్శించి సర్వేలో భాగంగా పరీక్ష నిర్వహణకు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు దీనిని పర్యవేక్షిస్తారు.
న్యాస్ పరీక్ష ఆధారంగానే రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయనేది నిర్ధారిస్తారు. ప్రతి మూడేళ్ళకోసారి ఈ పరీక్ష జరుగుతుంది. 2021లో జరిగిన న్యాస్ పరీక్షలో తెలంగాణ రాష్ట్రం దేశంలో అయిదవ స్థానంలో నిలిచింది. జాతీయ సగటు స్కోర్ కంటే కూడా రాష్ట్ర విద్యార్థుల స్కోర్ తక్కువగా ఉన్నట్టు గుర్తించా రు. దీంతో ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది.
న్యాస్‌ను ప్ర తిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పడంతో కొన్ని నెలలుగా పరీక్షపై పాఠశాలల ప్రధానోపాధ్యా యులు దృష్టి పెట్టారు. విద్యార్థులకు ఇప్పటికే మూడుసార్లు మోడల్ పరీక్షలు నిర్వహించారు. తాజా పరీక్ష ఫలితాలను ఏప్రిల్ లేదా మే నెలలో వెల్లడిస్తారని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి: పదో తరగతి పరీక్షలను మార్చి 15 నుంచి నిర్వహించాలని విద్యా శాఖ యోచన....
ఫరాఖ్‌కు నిర్వహణ బాధ్యతలు
న్యాస్ పరీక్షను 2021 వరకూ జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) నిర్వహించింది. ఈసారి నుంచి రాష్ట్రీయ సర్వేక్షణ్–2024 పేరుతో ఎన్‌సీఈఆర్‌టీలోని స్వ తంత్ర సంస్థ ఫరాఖ్ (పర్‌ఫార్మెన్స్ అసెస్‌మెంట్, రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్) నిర్వహిస్తోంది. గ తంలో 3, 5, 8, 10 తరగతులకు న్యాస్ పరీక్ష ఉండేది.
ఈసారి 3, 6, 9 తరగతులకు ఆ క్లాసు ల్లోని ప్రమాణాల మేర పరీక్ష నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 75,565 పాఠశాలల నుంచి 22,94,377 మంది ఈ పరీక్ష రాస్తున్నారు. వీరిలో ప్రభుత్వ స్కూళ్ళ నుంచి 50 శాతం, ప్రైవేటు స్కూళ్ళ నుంచి మరో 50 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 3,500 పాఠశాలల నుంచి లక్ష మందిని పరీక్షకు ఎంపిక చేశారు.
ఇవి కూడా చదవండి: ఈ డిసెంబర్ నెలలోనే.. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం ఇలా..
ఈసారి క్రిటికల్ థింకింగ్ కూడా..
న్యాస్ పరీక్ష విధానంలో ఈసారి నైపుణ్యాలకు పెద్దపీట వేస్తున్నారు. తరగతుల వారీగా విద్యార్థులకు భాష, గణితం, సైన్స్, సోషల్ సైన్స్, పరిసరాల పరిజ్ఞానంపై ప్రశ్నలు ఇస్తారు. ఈసారి అదనంగా విమర్శనాత్మక ఆలోచన (క్రిటికల్ థింకింగ్)కు సంబంధించిన నేర్పు, విశ్లేషణ నైపుణ్యాలు, భవిష్యత్‌లో ఉద్యోగాలు చేసేందుకు అవసరమైన నైపుణ్యాలపై కూడా ప్రశ్నలు ఇస్తున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
మల్టిపుల్ చాయిస్‌గా ఉండే ప్రశ్నలకు ఓఎంఆర్ షీట్‌లో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. మూడో తరగతికి 45 ప్రశ్నలు, గంటన్నర సమయం, ఆరో తరగతికి 51 ప్రశ్నలు, గంటన్నర, 9వ తరగతికి 60 ప్రశ్నలకు రెండు గంటల సమయం ఉంటుంది.
మొత్తం మీద న్యాస్ పరీక్ష కఠినంగా ఉండే అవకాశం ఉందని టీచ ర్లు చెబుతున్నారు. ప్రశ్నలను అనేక విధాలుగా ఇస్తున్నారని, సెంట్రల్ సిలబస్‌తో కూడిన ప్రశ్నలకు రాష్ట్ర విద్యార్థులు ఏ మేరకు జవాబిస్తారో వేచిచూడాల్సి ఉందని అంటున్నారు.