UGC NET 2023 Result Released : యూజీసీ నెట్ ఫలితాలు విడుదల.. మొత్తం ఎంత మంది అర్హత సాధించారంటే..?
ఇందులో భాగంగా గతేడాది డిసెంబర్ 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షను నిర్వహించింది. మొత్తం 83 సబ్జెక్టులకు దేశ వ్యాప్తంగా 292 నగరాల్లోని పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 9,45,918 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇప్పటికే ఎన్‌టీఏ యూజీసీ నెట్ డిసెంబర్ 2023 ప్రిలిమినరీ ఆన్సర్ కీలను కూడా విడుదల చేసింది.
☛ UGC NET December 2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి
How to check UGC NET December 2023 result?
- Visit official website ugcnet.nta.ac.in.
- Click on the December 2023 exam scorecard download link.
- Login with your application number and date of birth.
- Check your result.
- Download and save a copy of your score card for further reference.
యూజీసీ నెట్‌తో ఉపయోగాలు ఇవే..
☛ యూజీసీ నెట్‌లో ఉత్తీర్ణత సాధించి తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు పలు అవకాశాలు లభిస్తున్నాయి.
☛ అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాతో అధ్యాపక వృత్తిలో అడుగు పెట్టొచ్చు. ☛ యూజీసీ నిబంధనల ప్రకారం-నెట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో అర్హత సాధించిన వారినే ఈ పోస్ట్‌లకు ఎంపిక చేయాలి.
☛ జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే.. ప్రముఖ రీసెర్చ్ లేబొరేటరీల్లో మూడేళ్లపాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేయొచ్చు. తొలి రెండేళ్లు జేఆర్‌ఎఫ్ హోదాలో నెలకు రూ.31 వేల ఫెలోషిప్ పొందొచ్చు.
☛ జేఆర్‌ఎఫ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఎస్‌ఆర్‌ఎఫ్‌కు అర్హత లభిస్తుంది. ఈ దశలో రెండేళ్లపాటు నెలకు రూ.35 వేల స్కాలర్‌షిప్ అందుతుంది.
☛ ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో పీహెచ్‌డీ, రీసెర్చ్ అభ్యర్థుల ఎంపికలో నెట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఉంటుంది.
☛ జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు పూర్తి చేసుకున్న వారికి సైంటిస్ట్‌లుగా ప్రభుత్వ విభాగాల్లో కెరీర్ ప్రారంభించే అవకాశం లభిస్తుంది.
☛ ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్‌ల్లో జేఆర్‌ఎఫ్‌కు ఎంపికై పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పురావస్తు శాఖ, ఆర్థిక గణాంక శాఖలు, సామాజిక, న్యాయ మంత్రిత్వ శాఖ వంటి పలు ప్రభుత్వ విభాగాల్లో రీసెర్చ్ స్కాలర్స్‌గా అవకాశాలు దక్కుతాయి.
Tags
- ugc net 2023 results
- UGC NET December 2023 Results Released
- How to check UGC NET December 2023 result
- ugc net december 2023 eligibility criteria in telugu
- ugc net december 2023 qualifying marks
- ugc net december 2023 qualify candidates list
- ugc net december 2023 cut off
- ugc net result december 2023 direct link
- Sakshi Education Latest News