Skip to main content

Good News for Unemployed Youth : నిరుద్య‌గ యువ‌త‌కు గుడ్ న్యూస్‌.. ఎన్ఎస్ఏతో ఉన్న‌త ఉపాధి అవ‌కాశాలు.. వీరే అర్హులు..

దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుని, నైపుణ్య శిక్షణ కోసం నేషనల్ స్కిల్ అకాడమీ(ఎన్ఎస్ఏ)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
National skills academy courses for unemployed youth  National Skill Academy announces online training for unemployed youth in Telangana  Skill training for Telangana residents begins from January 2, 2025, under National Skill Academy  Unemployed youth and students in Telangana can apply for National Skill Academy online training.  Online training applications for software courses start today in Telangana

సాక్షి ఎడ్యుకేష‌న్: దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుని, నైపుణ్య శిక్షణ కోసం నేషనల్ స్కిల్ అకాడమీ(ఎన్ఎస్ఏ)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ అకాడమీ ఆధ్వర్యంలో అనేక మంది నిరుద్యోగులు, విద్యార్థుల‌కు ఏఐ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటాతో సహా 100కు పైగా సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. దీని కోసం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌ శిక్షణ కోసం దరఖాస్తులు నేడు అంటే, జ‌న‌వ‌రి 2, 2025 నుంచి ప్రారంభం అయ్యి, 9వ తేదీన ముగుస్తుంది.

Junior Colleges : జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో మూడు రోజుల‌పాటు ప్ర‌త్యేక శిక్ష‌ణ‌!!

ఈ మేరకు నేషనల్‌ స్కిల్‌ అకాడమీ ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ సాయి శ్రీమాన్ ప్రకటించారు. ఇంటర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌, డిప్లొమా, పీజీ, ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న అభ్య‌ర్థులు అర్హుల‌ని వారు వెంట‌నే ద‌ర‌ఖాస్తులు చేసుకొని, ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని కోరారు. ద‌ర‌ఖాస్తుల‌ను అధికారిక వెబ్‌సైట్‌ https://www.nationalskillacademy.in/ లో చేసుకోవాలని వివ‌రించారు. కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని శ్రీమాన్‌ వెల్లడించారు. పూర్తి వివరాలకు 9505800050 నంబర్ లేదా వెబ్‌సైట్‌ ను సంప్రదించవచ్చని కోరారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 02 Jan 2025 12:39PM

Photo Stories