Skip to main content

Students Protest : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల నిరసన

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు గిరిజన సంక్షేమ విద్యాభివృద్ధిని పట్టించుకోకపోవడంతో రానురాను గిరిజన విద్యాసంస్థలు నిర్వీర్యమవుతున్నాయి.
Students protest to resolve education sector issues

సీతంపేట: గిరిజన సంక్షేమ విద్య పట్ల కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు గిరిజన సంక్షేమ విద్యాభివృద్ధిని పట్టించుకోకపోవడంతో రానురాను గిరిజన విద్యాసంస్థలు నిర్వీర్యమవుతున్నాయి. కార్పొరేట్‌కు దీటుగా ట్రైబల్‌ వెల్ఫేర్‌ స్కూళ్లను తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.

Junior College Lecturers : జూనియ‌ర్ క‌ళాశాల‌లో టీచర్ల విధుల‌ను రెగ్యుల‌ర్ చెయ్యాలి

ఇప్పటికే పాఠశాలల్లో ఏఎన్‌ఎంలను నియమిస్తామని ప్రకటించిన హామీ సగం విద్యాసంవత్సరం గడిచినా కార్యరూపం దాల్చలేదు. తాజాగా పాఠశాలలకు మెయింటనెన్స్‌ గ్రాంటులో కూడా మొండి చేయి చూపారు. మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, ఎయిడెడ్‌, మున్సిపల్‌ తదితర యాజమాన్యాల పాఠశాలలకు నిధులు మంజూరు చేశారు. గిరిజన విద్యా సంస్థలకు ఎటువంటి నిధులు విడుదల చేయకపోవడం విడ్డూరం.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ఇదీ పరిస్థితి..

జిల్లాలో సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏల పరిధిలో 92 ఆశ్రమపాఠశాలలు, 410 గిరిజన ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలలో ఉపాధ్యాయులు బోధించడానికి సుద్దముక్కలు, డస్టర్ల కొనుగోలు, రికార్డులు, ఇతర స్టేషనరీ, ఏవైనా చిన్న, చిన్న రిపేర్లు ఉంటే వాటి మరమ్మతులకు నిధులు వినియోగించాల్సి ఉంది. సర్వశిక్షాభియాన్‌ విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు విడుదల చేయాల్సి. విద్యార్థులు 30 మంది లోపు ఉంటే పాఠశాలకు రూ.12,500 అంతకంటే ఎక్కువగా ఉంటే రూ.25 వేలు చొప్పున నిధులు కేటాయిస్తారు. ఉన్నత పాఠశాలను 3 విభాగాలుగా గుర్తించి 300 లోపు విద్యార్థులు ఉంటే రూ.50 వేలు, 300ల నుంచి 450 మధ్య విద్యార్థులున్న పాఠశాలలకు రూ.75 వేలు, ఆపైన ఉంటే రూ.లక్ష ఇవ్వాల్సి ఉంది. ఈ మేరకు జిల్లాకు రూ.1.08 కోట్లు నిధులు కేటాయించారు.

Andhra Pradesh News:రాష్ట్రంలో ఏకైక ఒంటిపూట బడి .... ఒంటిగంటకే ఫైనల్‌ బెల్‌

అయినప్పటికీ గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, కేజీబీవీలకు సైతం రూపాయి కూడా విడుదల చేయకపోవడం గమనార్హం. ఆశ్రమవసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు వండి వడ్డించడానికి నాల్గోతరగతి ఉద్యోగులైన వంటమనిషి, వంట సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సమయానికి విద్యార్థులకు భోజన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో వసతిగృహసంరక్షకులు వంట చేసేవారిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకుని రోజువారీ వేతనం సొంతడబ్బులు చెల్లించుకునే పరిస్థితి ఉంది. కనీసం మెయింటనెన్స్‌ గ్రాంట్‌ కూడా ప్రభుత్వం విడుదల చేయకపోతే సుద్దముక్కలు, స్టేషనరీ వంటి వాటికి చేతి చమురు వదిలేలా తప్పడం లేదని పలు ఆశ్రమ పాఠశాలల యాజమాన్యాలు వాపోతున్నాయి.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం

ఆశ్రమపాఠశాలలు, జీపీఎస్‌ పాఠశాలలకు ఇంకా నిధులు మంజూరు కాని మాట వాస్తవమే. అయితే గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలకు మెయింటనెన్స్‌ గ్రాంటు విడుదల చేయకపోవడంపై ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌తో పాటు డీఈవో దృష్టికి కూడా తీసుకువెళ్లాము.

–పి.నారాయుడు, డిప్యూటీ ఈవో

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 25 Nov 2024 05:37PM

Photo Stories