Junior College Lecturers : జూనియర్ కళాశాలలో టీచర్ల విధులను రెగ్యులర్ చెయ్యాలి
కడప: ఉమ్మడి కడప జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేయాలని కడప జిల్లా ఏజేసీ చైర్మన్ జానీబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కడపలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉమ్మడి కడప జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ కోసం ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేసినా ప్రభుత్వంలో స్పందన లేదన్నారు. సమావేశం అనంతరం కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్ కోసం జేఏసీని ఏర్పాటు చేసుకున్నారు.
ISRO: త్వరలో రెండు పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాలను చేపట్టనున్న ఇస్రో
ఇందులో కడప జిల్లా నుంచి రాష్ట్ర జేఏసీలో రామచంద్రారెడ్డి, మన్సూర్ అలీ, చంద్రమోహన్‌రెడ్డిలను ఎన్నుకొన్నారు. అలాగే జిల్లా జేఏసీ చైర్మన్‌గా జానీ బాబును ఎన్నుకున్నారు. అలాగే జిల్లా కమిటీలో రాయచోటి జోన్ నుంచి శివరామిరెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, రాధాకృష్ణ , ఇమాంతుల్లా, రాజంపేట జోన్ నుంచి హనీఫ్, సుబ్బయ్య, అమృతాదేవి, పులివెందుల జోన్ నుంచి రామ్మోహన్ రెడ్డి, ఇర్ఫాన్, మేడా శ్రీనివాసులు, జమ్మలమడుగు జోన్ నుంచి రామ్మోహన్, బెన్నీ, రామలక్ష్మి, కడప జోన్ నుంచి నాగేంద్ర, ఫక్రుద్దీన్, మధు శ్రీనివాస్, మల్లేశ్వరి, బద్వేల్ జోన్ నుంచి రంతుబాషాను ఎన్నుకున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)