Skip to main content

Half day Schools 2024 : గుడ్‌న్యూస్‌.. రేప‌టి నుంచి ఒంటి పూట బడులు.. ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌.. మొత్తం ఎన్ని రోజులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ స్కూల్స్ విద్యార్థులు ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా మూడు వారాలు పాటు స్కూల్స్‌కు కేవ‌లం ఒక్క పూట మాత్ర‌మే స్కూల్స్ నిర్వ‌హించ‌నున్నారు.
Half day Schools 2024   Telangana schools announcement for 9 am to 1 pm classes  Telangana government school timing change Telangana government schools updated schedule

తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా 2024 నవంబర్ 6వ తేదీ (బుధ‌వారం) నుంచి ప్రభుత్వ పాఠశాలలకు ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి.

రేప‌టి నుంచి స్కూళ్ల టైమింగ్స్ ఇవే...
ఇంటింటి సర్వేలో స్కూళ్ల టీచర్లు పాల్గొననుండడంతో అందుకు తగ్గట్టుగా స్కూల్ టైమింగ్స్​ను మార్చారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే స్కూళ్లు కొనసాగనున్నాయి. పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించి ఇంటికి పంపించనున్నారు. యూపీఎస్, హైస్కూళ్లలో పనిచేస్తున్న ఎస్జీటీలను ఈ సర్వే నుంచి మినహాయించారు. 

November Month School Holidays 2024 : ఈ న‌వంబ‌ర్ నెల‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవే...! తెలుగు రాష్ట్రాల్లో మాత్రం...

కార‌ణం ఇదే...
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కుల గణన ఇంటింటి సమగ్ర సర్వేకు సర్వం సిద్ధమైన విష‌యం తెల్సిందే. న‌వంబ‌ర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సామాజిక, విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో 80 వేల మంది సేవలను వినియోగించుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఈ 80 వేల మందిలో మెజార్టీగా టీచర్ల సేవలను వినియోగించుకుంటామని, వారితోపాటు తహసీల్దార్, ఎండీఓ, ఎంపీఓ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ వర్కర్ల సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. 

☛➤ Good News Schools Holiday 2024 : న‌వంబ‌ర్ 7వ తేదీన స్కూల్స్‌, కాలేజీలు సెలవు ప్ర‌క‌టించిన‌ ప్ర‌భుత్వం.. 15వ తేదీన కూడా...!

ఉత్తర్వులు జారీ..
ఈ స‌ర్వేలో... ప్రధానంగా స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రైమరీ స్కూల్ టీచర్లు, హెడ్మాస్టర్లు ఉండబోతున్నారు. సర్వేలో పాల్గొనే ఎన్యుమరేటర్లలో దాదాపు సగం, అంటే 40 వేల మంది టీచర్లే. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సర్వేలో విద్యా శాఖ పరిధిలోని ప్రైమరీ స్కూల్ టీచర్లతో పాటు ఎంఆర్​సీ సిబ్బంది, ఎయిడెడ్ నాన్ టీచింగ్ సిబ్బంది సేవలను వినిగియోచుకోనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Published date : 05 Nov 2024 12:47PM

Photo Stories