New Sainik Schools: 100 సైనిక్ స్కూళ్ల ఏర్పాటు.. ప్రతి జిల్లా.. ప్రతి రీజియన్‌లో..
Sakshi Education
అలప్పుజా(కేరళ): దేశంలో ప్రాథమిక విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచే లక్ష్యంతో దేశవ్యాప్తంగా కొత్తగా 100 సైనిక్ స్కూళ్లను ఏర్పాటుచేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

కేరళలోని అలప్పుజాలో విద్యాధిరాజా సైనిక్ స్కూల్ 47వ వార్షికోత్సవంలో రాజ్‌నాథ్ పాల్గొని ప్రసంగించారు. ‘‘దేశంలోని సాంస్కృతికంగా భిన్న నేపథ్యలున్న ప్రతి జిల్లాలో ప్రతి రీజియన్‌లోని ప్రజలకందుబాటులో ఉండేలా సైనిక్ స్కూళ్లను నెలకొల్పుతాం.
ఆరోగ్యం, కమ్యూనికేషన్లు, పరిశ్రమలు, రవాణా, రక్షణ వంటి భిన్న రంగాల్లో ఆధునికతతో భారత్ స్వావలంభనను సాధించింది. చిన్నారుల ర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ఇక విద్యారంగంలోనూ సంస్కరణలు తప్పనిసరి.
![]() ![]() |
![]() ![]() |
సైనికుడిని కేవలం యుద్ధ కోణంలోనూ చూడకూడదు. క్రమశిక్షణ, సమయపాలన, అంకితభావం, దేశభక్తి, నిస్వార్థ సేవ, స్వీయనియంత్రణ వంటి అంశాలను సైనికుల నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇవే గొప్ప లక్షణాలు నాడు స్వామి వివేకానంద, ఆది శంకరాచార్య, రాజా రవివర్మ వంటి గొప్పవారిలోనూ ఉన్నాయి’’అని రాజ్‌నాథ్ అన్నారు.
Published date : 23 Jan 2025 01:02PM