Skip to main content

Summative Assessment Exams 2024: విద్యార్థులకు పరీక్షలకు వేళాయె..

Summative Assessment Exams 2024: విద్యార్థులకు పరీక్షలకు వేళాయె..
Summative Assessment Exams 2024: విద్యార్థులకు పరీక్షలకు వేళాయె..

విద్యారణ్యపురి: విద్యార్థులకు దసరా సెలవులు ముగిశాయి. ఈనెల 15 నుంచి తరగతులు పునః ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరానికి(2024–2025) సంబంధించి సమ్మిటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ)–1 పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈమేరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని హనుమకొండ, వరంగల్‌, ములుగు, మహబూబాబాద్‌, జనగామ, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలో ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఈ పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈమేరకు డీఈఓలు కూడా హెచ్‌ఎంలకు పరీక్షల నిర్వహణపై ఆదేశాలు జారీచేశారు. టైంటేబుల్‌ కూడా విడుదల చేశారు. పాఠశాలల్లో విద్యార్థులను అందుకు సన్నద్ధం చేస్తున్నారు.

Also Read:  10వ తరగతి అర్హతతో ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీ క్లర్క్‌ ఉద్యోగాలు.. జీతం 32వేలు

టైంటేబుల్‌..

ఈనెల 21న ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఫస్ట్‌లాంగ్వేజ్‌ తెలుగు, ఉర్దూ, ఆరో తరగతి విద్యార్థులకు ఫస్ట్‌లాంగ్వేజ్‌ తెలుగు, ఉర్దూ, 8,9,10 తరగతుల విద్యార్థులకు మ్యాథ్స్‌మెటిక్స్‌, ఏడో తరగతికి ఫస్ట్‌ లాంగ్వేజ్‌ తెలుగు, ఉర్దూ పరీక్షలు నిర్వహించాల్సింటుంది.

● 22న ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్‌, ఆరు,ఏడు తరగతుల సెకండ్‌లాంగ్వేజ్‌ హిందీ, తెలుగు, 8,9,10వ తరగతి విద్యార్థులకు ఫిజికల్‌ సైన్స్‌ పరీక్షలు నిర్వహించాల్సింటుంది.

● 23న ఒకటి నుంచి 5వతరగతి వరకు మ్యాథ్‌మెటిక్స్‌, ఆరు, ఏడు తరగతులకు థర్డ్‌ లాంగ్వేజ్‌ ఇంగ్లిష్‌, 8,9,10వ తరగతులకు బయాలజికల్‌ సైన్స్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

● 24న ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఈవీఎస్‌, 6,7,8,9,10వతరగతి విద్యార్థులకు సోషల్‌ స్టడీస్‌ సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించా ల్సింటుంది.

● 25న ఆరో తరగతి విద్యార్థులకు మ్యాథ్‌మెటిక్స్‌, 8,9,10వ తరగతులకు ఫస్ట్‌లాంగ్వేజ్‌ (తెలుగు,ఉర్దూ), 7వ తరగతి విద్యార్థులకు మ్యాథ్‌మెటిక్స్‌ పరీక్షలు నిర్వహించాల్సింటుంది.

● 26న ఆరు, ఏడో తరగతి విద్యార్థులకు జనరల్‌సైన్స్‌, 8,9,10 తరగతులకు సెకండ్‌ లాంగ్వేజ్‌ (హిందీ, తెలుగు) పరీక్షలు నిర్వహించాల్సింటుంది.

● 28న 8,9,10 తరగతుల విద్యార్థులకు థర్డ్‌ లాంగ్వేజ్‌ ఇంగ్లిష్‌ సబ్జెక్టుల పరీక్షలు నిర్వహిస్తారు.

పరీక్షల సమయం ..

● ఉదయం..

ఎస్‌ఏ–1 పరీక్షలు ఉదయం సెషన్‌లో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 6 8, తరగతుల విద్యార్థులకు ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయా తేదీల్లో నిర్వహించాల్సింటుంది,

● మధ్యాహ్నం సెషన్‌లో..

7,9 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం సెషన్‌లో నిర్వహిస్తారు. అందులో 7వతరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు 1.15 నుంచి సాయంత్రం 4–15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

Published date : 17 Oct 2024 03:52PM

Photo Stories