Sports Quota In Govt Jobs: ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా పెంపు.. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తే రూ.7 కోట్లు
చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు స్పోర్ట్స్ ఫర్ ఆల్, నర్చర్ టాలెంట్, స్పోర్ట్స్ ఎకో సిస్టం, గ్లోబల్ విజిబిలిటీ ప్రాతిపదికగా పాలసీని రూపొందించామన్నారు. గ్రామస్థాయి నుంచి క్రీడల ప్రోత్సాహకానికి ప్రణా ళిక పొందుపరిచినట్టు చెప్పారు.
ఇందులో భాగంగా ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న క్రీడా కోటా రిజర్వేషన్ 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. శాప్‌లో గ్రేడ్–3 కోచ్‌ల కోసం ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిన వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు ప్రకటించారు.
ఒలింపిక్స్ విజేతలకు భారీ ప్రోత్సాహకాలు
ఒలింపిక్స్‌లో బంగారు పతకానికి ప్రస్తుతం రూ.75 లక్షలు ఇస్తుండగా, ఇకపై రూ.7 కోట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు సీఎం ప్రకటించారు. రజత పతకానికి రూ.50 లక్షలు నుంచి రూ.5 కోట్లు, కాంస్యానికి రూ.30 లక్షల నుంచి రూ.3 కోట్లు, పాల్గొన్న వారికి రూ.50 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని ఆదేశించారు.
Summative Exams: ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న సమ్మేటివ్ పరీక్షలు
ఏషియన్ గేమ్స్ బంగారు పతకానికి రూ.4 కోట్లు, రజత పతకానికి రూ.2 కోట్లు, కాంస్య పతకానికి రూ.కోటి, పాల్గొన్న వారికి రూ.10 లక్షల ప్రోత్సాహకం ఇవ్వాలన్నారు. వరల్డ్ ఛాంపియన్‌షిప్, వరల్డ్ కప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజతానికి రూ.35 లక్షలు, కాంస్యానికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.10 లక్షలు, రజతానికి రూ.5 లక్షలు, కాంస్య పతకానికి రూ.3 లక్షలు ఇవ్వాలన్నారు. ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.2.50 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.2 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, అధికారులు పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)