Skip to main content

TG DSC Toppers Success Stories : ఈ క‌సితోనే చ‌దివి నేను గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్ ఉద్యోగం కొట్టా.. కానీ...

తెలంగాణ ప్ర‌భుత్వం ఇటీవ‌లే డీఎస్సీ-2024 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఈ ఫ‌లితాల్లో ఎంతో మంది టీచ‌ర్ ఉద్యోగం సాధించి త‌మ క‌ల‌ను నిజం చేసుకున్నారు.
TG DSC Ranker Success Story

ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్ ఉద్యోగం సాధించిన వారి స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం...

నా ల‌క్ష్యం ఇదే.. : గడ్డం ప్రవళిక, వెంకటాపురం(కె)
ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని చిన్న నాటి నుంచి ఉండేది. తల్లిదండ్రుల పోత్సాహంతో టీటీసీ, బీఈడీ పూర్తి చేశాను. టెట్‌లో కూడా 105 ర్యాంకు వచ్చింది. పట్టుదలతో చదివాను. ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది. విద్యార్థులకు పాఠాలు భోదించి వారిని ఉన్నతస్థానంలో నిపాలన్నదే లక్ష్యం. 

➤☛ TG DSC 2024 Ranker Story : కూలీ ప‌ని చేసుకుంటూ.. చ‌దివి.. గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్‌ ఉద్యోగం సాధించానిలా.. కానీ..

పేదరికం అడ్డుకాదు..

dsc ranker success story in telugu

లక్ష్యంతో చదువుకుని ప్రభుత్వ కొలువు సాధించా. తన తండ్రి రామాదాసు ప్రభుత్వం పాఠశాలలో ఔట్ సోర్సింగ్‌లో స్వీపర్‌గా పని చేస్తూ చదివించారు. తండ్రి కష్టానికి ఫలితంగా ఉద్యోగం సాధించాలని, చదువుకు పేదరికం అడ్డుకాదనే పట్టుదలతో చదవి ఉద్యోగం సాధించాను. తన తండ్రి కష్టానికి ఫలితంగా ఉద్యోగం సాధించాను.
– దాసరి అనూష, గోవిందరావుపేట

➤☛ DSC Ranker Inspirational Success Story : టీ అమ్మూతూ..రూ.5 భోజనం తింటూ.. ఒకేసారి 5 ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను సాధించానిలా.. కానీ..

నా చిరకాల కోరిక నెరవేరింది..

dsc ranker inspire story in telugu

ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలనే చిరకాల కోరిక నెరవేరింది. క్రమశిక్షణతో చదువుకుని డీఈడీ, పీజీ పూర్తి చేశాను. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో డీఎస్సీ పరీక్ష రాసి తెలుగు పండిట్‌గా ఉద్యోగం సాధించడం సంతోషంగా ఉంది. పాఠశాలల్లోని విద్యార్థులను క్రమశిక్షణతో ఉన్నత స్థాఽనంలో నిలిపేందుకు కృషి చేస్తా.
– కావిరి రాజబాబు, బుట్టాయిగూడెం

☛➤ Two Sisters Success Story : ఓ తండ్రి క‌థ‌.. త‌మ‌ ఇద్ద‌రి కూతుర్ల‌ను ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలుగా చేశాడు ఇలా.. కానీ...

Published date : 16 Oct 2024 06:02PM

Photo Stories