Skip to main content

DSC 2024: డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయా?

ఆదిలాబాద్‌ టౌన్‌: డీఎస్సీ–2024 నియామక కౌన్సెలింగ్‌లో గందరగోళం చోటు చేసుకుంది. పోస్టింగ్‌లు కేటాయిస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించడంతో ఎంపికై న ఉపాధ్యాయులు అక్టోబర్ 15న ఉదయమే కార్యాలయానికి చేరుకున్నారు.
any irregularities in DSC appointments

అయితే కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిలిచిపోయిందని.. కార్యాలయానికి వచ్చిన వారి నుంచి సంతకాలు సేకరించారు. తిరిగి కౌన్సెలింగ్‌ నిర్వహించే తేదీ ప్రకటిస్తామని తెలుపడంతో వారు ఇంటిముఖం పట్టారు.

మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మళ్లీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని ప్రకటించడంతో వారు మళ్లీ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు.

చదవండి: DSC Topper : టీఎస్ డీఎస్సీలో టాపర్‌గా నిలిచిన రెంటచింతల యువకుడు.. ఇదే ఇత‌ని స‌క్సెస్ స్టోరీ...

రెండు గంటలకు కౌన్సెలింగ్‌ ప్రారంభించాల్సి ఉండగా, కొందరు అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందని, తమకు పోస్టింగ్‌ ఇస్తేనే కౌన్సెలింగ్‌ చేపట్టాలని ఆందోళనకు దిగారు.

వీరికి ఉపాధ్యాయ, బీసీ సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. దీంతో డీఈవో కార్యాలయంలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. సాయంత్రం వరకు ప్రక్రియ నిలిచిపోయింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కౌన్సెలింగ్‌ను ప్రారంభించగా.. రాత్రి వరకు కొనసాగింది.

Published date : 16 Oct 2024 12:56PM

Photo Stories