Skip to main content

DSC 2024 Appointments: 11 మందికి పోస్టింగ్‌ ఉత్తర్వులు.. పోస్టింగ్‌ లేట్‌ అవ్వడానికి కారణం ఇదే..

డీఎస్సీ నియామకాల్లో భాగంగా ఇటీవల 256 మందికి పోస్టింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. జిల్లాలో 266 మందిని ఎంపిక చేయగా, పలు తప్పిదాలు, వివిధ కారణాలతో పది మంది పోస్టింగ్‌లను అబయన్స్‌లో ఉంచారు.
DSC 2024 11 posting orders

12వ ర్యాంకు సాధించిన ఎస్జీటీ అభ్యర్థి పేరు జాబితాలో లేకపోగా ఆయన ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ అభ్యర్థితో పాటు పలువురికి పోస్టింగ్‌ కేటాయించారు. ఎస్జీటీ తెలుగు మీడియంలో ఎన్‌.సాయికృష్ణకు ఆదిలాబాద్‌ పట్టణంలోని ప్రాథమిక పాఠశాల మహాలక్ష్మివాడలో పోస్టింగ్‌ ఇచ్చారు.

చదవండి: DSC 2024: చదివిన బడిలోకే సారుగా ఉద్యోగం: పుర్రె రమేశ్

ఎస్జీటీ తెలుగు మీడియంలో ఆర్‌.భార్గవికి గాదిగూడలోని కౌట్ల, షిరిన సబకు గాదిగూడలోని బుద్దమహార్‌గూడ, స్కూల్‌ అసిస్టెంట్‌ స్పెషల్‌ ఎడ్యూకేషన్‌లో మహేశ్వరికి జెడ్పీఎస్‌ఎస్‌ బేల, స్పెషల్‌ ఎడ్యూకేషన్‌ ఎస్జీటీలో సౌజన్యకు ఎంపీపీఎస్‌ శ్యాంపూర్‌, పవార్‌ గోపాల్‌కు కుచులాపూర్‌, ఎస్‌ఏ ఫిజికల్‌ సైన్స్‌లో టి.అంకితకు కన్గుట్ట, ఎస్జీటీ మరాఠీ మీడియంలో కె.పల్లవికి బేల మండలంలోని టాక్లీ, పీఈటీలో ఎ.స్వర్ణలతకు ప్రభుత్వ హిందీ హైస్కూల్‌ ఆదిలాబాద్‌, ఎస్జీటీ హిందీ మీడియంలో ఆయేషా తస్లీమ్‌కు కేఆర్‌కే పాఠశాలను కేటాయించారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

శివాజీకి స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగులో బేల మండలంలోని కొగ్దూర్‌లో పోస్టింగ్‌ కేటాయించగా, ఆయన ఆ పోస్టులో చేరలేదు. తనకు ఫిజికల్‌ సైన్స్‌ కేటాయించాలని పట్టుబట్టాడు. ఇదిలా ఉండగా ఆర్‌.భార్గవి, షిరిన్‌సబ, మహేశ్వరి, కె.పల్లవి, ఎ.స్వర్ణలత, ఆయేషా తస్లీమ్‌లకు అనూహ్యంగా కొలువులు దక్కాయి. దీంతో వీరిలో ఆనందం వ్యక్తమైంది.

Published date : 04 Nov 2024 10:44AM

Photo Stories