Skip to main content

DSC 2024: చదివిన బడిలోకే సారుగా ఉద్యోగం: పుర్రె రమేశ్

I got a job in the school I attended

రాయికల్‌(జగిత్యాల): నేను చదువుకుంటూ, ఆడిపాడిన పాఠశాలలోనే పీడీగా ఉద్యో గ ం సాధించడం సంతోషంగా ఉంది. ఆడుకున్న స్థలంలో అడుగుపెట్టడం ఒక క్రీడాకారుడిగా, పూర్వ విద్యార్థిగా గర్వంగా ఉంది. రాయికల్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 3 నుంచి 5వ తరగతి వరకు, జెడ్పీహెచ్‌ఎస్‌లో 6 నుంచి 8వ తరగతి వరకు, కట్లకుంట జెడ్పీహెచ్‌ఎస్‌లో 9, 10వ తరగతులు, మేడిపల్లి గురుకులంలో ఇంటర్మీడియట్‌ చదివాను. చదువుకున్న రాయికల్‌ హైస్కూల్‌లోనే నేను పీడీగా ఉద్యోగం సాధించడం చెప్పలేని అనుభూతినిస్తోంది. విద్యార్థులను మంచి క్రీడాకారులు గా తయారు చేసేందుకు నావంతు ప్రయత్నం చేస్తా.

– పుర్రె రమేశ్, పీడీ, రాయికల్‌ హైస్కూల్‌

కలలో కూడా ఊహించలేదు

రుద్రంగి(వేములవాడ): మాది రుద్రంగి మండల కేంద్రం. నేను స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోనే 6 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. విద్యాబుద్ధులు నేర్చిన బడిలో టీచర్‌గా చేరడం చెప్పలేని ఆనందాన్నిస్తోంది. ఇది నేను కలలో కూడా ఊహించలేదు. విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తూ, వారు క్రమశిక్షణతో మెలిగేలా చూస్తా. సమాజంలో మంచి పౌరులుగా ఎదిగేందుకు, మంచి మార్కులతో ఉత్తీర్ణలయ్యేందుకు నా వంతు కృషి చేస్తా.

– వేణుకుమార్‌, టీచర్‌, జెడ్పీ హైస్కూల్‌, రుద్రంగి

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి

గంభీరావుపేట(సిరిసిల్ల): మాది గంభీరావుపేట. నేను స్వగ్రామంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలోనే చదువుకున్నాను. ఇప్పుడు ఇదే బడిలో స్కూల్‌ అసిస్టెంట్‌(ఇంగ్లిష్‌)గా ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది. పాఠశాలలో ఉంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు, నాకు చదువు చెప్పిన సార్లు గుర్తొస్తున్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తా.

– శనిగరపు రాజు, టీచర్‌, జెడ్పీ బాలుర హైస్కూల్‌, గంభీరావుపేట
 

Published date : 17 Oct 2024 04:03PM

Photo Stories