BRAOU VC former TSPSC Chairman: అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ వీసీగా మాజీ టీఎస్‌పీఎస్సీ చైర్మన్
కాకతీయ వర్సిటీ నుంచి కెరీర్ ప్రారంభం
ఘంటా చక్రపాణి కరీంనగర్ జిల్లా యాస్వాడ గ్రామంలో ఓ రైతు కుటుంబంలో జన్మించా రు. ఆ తర్వాత కుటుంబం పెద్దపల్లి జిల్లా ధూలికట్ట గ్రామానికి వెళ్లింది. ప్రభుత్వ స్కూల్‌లోనే ఆయన విద్యాభ్యాసం పూర్తయింది. సుల్తానాబాద్ జూనియర్ కాలేజీలో, కరీంనగర్ డిగ్రీ కాలేజీలో చదువుకున్నారు.
1990లో ఉస్మానియా వర్సిటీ నుంచి ఎంఏ సోషియాలజీలో గోల్డ్ మెడల్ పొందారు.1992లో కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ డిప్లొమా, 2001లో సోషియాలజీ ఆఫ్ రిలీజియన్‌లో పీహెచ్‌డీ చేశారు. కాకతీయ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా మొదలైన ఆయన కెరీర్ అంచెలంచెలుగా ఎదిగింది.
చదవండి: Degree Admissions: ఓపెన్ డిగ్రీ అడ్మిషన్ల గడువు పెంపు
1994లో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్, అడకమిక్స్ డైరెక్టర్ వంటి కీలక మైన సేవలందించారు. సామాజిక అంశాలపై విశే షమైన అనుభవం ఉన్న చక్రపాణి పలు అవార్డులు పొందారు. తెలంగాణ వాదాన్ని తనదైన శైలిలో బలంగా విన్పించేవారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఆయన తొలి చైర్మన్‌గా వ్యవహరించారు. కంప్యూటర్ బేస్డ్ నియామక పరీక్షను తొలిసారి ప్రవేశపెట్టారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
జేఎన్టీయూహెచ్ ఇన్‌చార్జి వీసీగా బాలకిష్టారెడ్డి
జేఎన్టీయూహెచ్ ఇన్‌చార్జి ఉపకులపతిగా ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డిని ప్రభుత్వం నియమించింది. పూర్తి స్థాయి వీసీ నియామకం జరిగే వరకు ఆయన ఈ స్థానంలో కొనసాగుతారు. ఇటీవల అన్ని యూనివర్సిటీలకు వీసీల నియామకం చేపట్టారు.
జేఎన్టీయూహెచ్ వీసీ కోసం నియమించిన సెర్చ్ కమిటీ సిఫార్సు చేసిన పేర్లను ప్రభుత్వం గవర్నర్‌కు పంపకుండా నిలిపివేసింది. మరో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అప్పటికే ఈ వర్సిటీ తాత్కాలిక వీసీగా అప్పటి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గా ఉన్న బుర్రా వెంకటేశం కొనసాగుతున్నారు.
ఆయన ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఇన్‌చార్జి వీసీ నియామకం అనివార్యమైంది. ఈమేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ డిసెంబర్ 6న ఉత్తర్వులు జారీ చేశారు.
Tags
- Prof Ghanta Chakrapani
- Dr BR Ambedkar Open University
- BRAOU
- TGPSC
- BRAOU VC former TSPSC Chairman
- telangana public service commission
- Governor Jishnu Dev varma
- V Balakista Reddy
- V Balakista Reddy as in-charge VC of JNTUH
- TGCHE
- Yaswada Village
- Telangana govt appointed Ghanta Chakrapani as as vice-chancellor of BRAOU
- Telangana News